వావ్.. 200 కోట్లు కలెక్ట్ చేసింది

వావ్.. 200 కోట్లు కలెక్ట్ చేసింది

ఈ ఏడాదంతా బాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు తగిలాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు నటించిన సినిమాలు దారుణమైన ఫలితాలనందిస్తే.. వేరే భారీ సినిమాలకు కూడా చుక్కెదురైంది. అసలే ‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డు స్థాయి వసూళ్లతో బాలీవుడ్ సినిమాలకు సవాలు విసిరితే.. అదే సమయంలో వాళ్ల సినిమాలు దారుణమైన ఫలితాలనందుకోవడం బాలీవుడ్‌ను కలవరపెట్టింది. అక్షయ్ కుమార్ సినిమాలు ‘జాలీ ఎల్‌ఎల్బీ’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ మినహాయిస్తే మొన్నటిదాకా చెప్పుకోవడానికి పెద్ద హిట్లే లేవు బాలీవుడ్‌కు.

ఐతే ఇప్పుడో సినిమా బాలీవుడ్‌కు గొప్ప ఊరటనిచ్చింది. అదే.. జుడ్వా-2. వరుణ్ ధావన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన ఈ చిత్రం అంచనాలకు అందని స్థాయిలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ కామెడీ మూవీ.. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

చాన్నాళ్లుగా సరైన సినిమా పడక నిరాశలో ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులు.. ఈ సినిమాను ఎగబడి చూశారు.దీంతో ఈ చిత్రం మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇండియా వరకే ఈ చిత్రం రూ.130 కోట్ల మార్కును దాటింది. అమెరికాలో ‘జుడ్వా-2’ 6 మిలియన్ల మార్కుకు చేరువగా వెళ్లడం విశేషం.

పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే బోల్తా కొడుతున్న సమయంలో వరుణ్ ధావన్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే. 90ల్లో ‘హలో బ్రదర్’కు రీమేక్‌గా వచ్చిన ‘జుడ్వా’కు ఇది రీమేక్. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ రూపొందించిన ఈ చిత్రంలో తాప్సి, జాక్వెలిన్ కథానాయికలుగా నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు