జగపతి మాటలు కుల పిచ్చ కాకులకు ఎక్కుతాయా?

జగపతి మాటలు కుల పిచ్చ కాకులకు ఎక్కుతాయా?

కొంతమంది స్టార్ హీరోలను స్పష్టంగా చూస్తే.. అతని వెంటే అదే కులానికి చెందిన ఒక ఇద్దరు ముగ్గురు తిరుగుతుంటారు. వారు వెంటనే మనోడు మనోడు అంటూ డప్పేస్తూ.. కులం గురించి ఛాతిని బాదుకుంటూ తెగ చెప్పేస్తుంటారు. అవన్నీ విని ఆ హీరో కూడా అలాంటోడేనా అనుకుంటారు చాలామంది సినీ ప్రియులు. కాని తనదైన శైలిలో దూసుకుపోతున్న స్టార్ నటుడు జగపతి బాబు.. ఇలాంటి కుల పిచ్చ కాకులకు ఒక టివి ప్రోగ్రాంలో బాగా అర్ధమయ్యేలా గడ్డి పెట్టాడు.

''ఇప్పుడు మనకు ఒక పని అవసరమై ఒక మినిష్టర్ దగ్గరకు వెళతాం. అతనిది ఏ కులమైనా కూడా అతని కాళ్ల మీద పడతాం. అలాగే చాలామంది కార్పొరేట్ పవర్ బ్రోకర్లు ఉంటారు.. వారి కులం ఏంటో చూడకుండానే వారిని సాయం అడుగుతాం. ఇంట్లో డ్రైవర్, మెయిడ్ ను పెట్టుకునేటప్పుడు కులం గురించి మాట్లాడం. అసలు మనం కులం వాడే ఎవడన్నా ఎదిగితే కూడా.. 'వాడా.. మనోడేలే.. ఎట్టాగొట్టా సంపాదించాడు' అంటూ ఈగో చూపిస్తాం. ఆస్తి కోసం సొంత అన్నను చంపినోళ్లు ఉన్నారు.. అప్పుడు కులం గుర్తురావట్లేదు. పైగా కులం అనే ఫీలింగ్ చాలామందికి లేకపోయినా కూడా పక్కనోళ్లు ఎక్కిస్తుంటారు. అసలు ఈ కులం అన్న పదానికి అర్ధమేలేదు. ప్రేమ అనేది ముఖ్యం'' అంటూ ఒక ఇంటర్యూలో సెలవిచ్చాడు.

నిజమే కదా.. ఇదంతా సినిమాల వారికి ఎక్కిచ్చి చూస్తే.. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు ఎవరూ మన లీడింగ్ హీరోల కులాలే కాదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు, ఎడిటర్లు, మేకప్ ఆర్టిస్టులు, లైట్లు మోసే లైట్ మ్యాన్స్, కెమెరా మ్యాన్లు అందరూ వేరే కులాల వారే. అలాంటప్పుడు అంతమంది కలసి తీసిన సినిమాకు.. మా హీరోది ఆ కులం కాబట్టి మా సినిమాలను మా కులం ఫ్యాన్స్ బాగా చూస్తారు అన్నట్లు పబ్లిసిటీ చేయడం దారుణం. ఏ సినిమా అయినా కూడా.. అన్ని కులాల వారు చూస్తేనే ఆడుతుంది. మరి హీరోల పక్కనుండే ఆ కాకీస్ కు ఇవన్నీ అర్ధమవ్వాలి. అర్దం చేసుకోవాలి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు