ఎన్టీఆర్‌ని దిల్‌ రాజు అలా గిల్లేసాడేంటి?

ఎన్టీఆర్‌ని దిల్‌ రాజు అలా గిల్లేసాడేంటి?

రవితేజ హీరోగా దిల్‌ రాజు నిర్మించిన 'రాజా ది గ్రేట్‌' ఈ గురువారం విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ కథ చాలా మంది హీరోల దగ్గరకి వెళ్లి, చివరకు రవితేజ దగ్గరకు వచ్చిందని దిల్‌ రాజు చెప్పాడు. ముందుగా ఈ బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేయడానికి రామ్‌ సరేనన్నాడు. అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నానని కూడా ప్రకటించాడు. అయితే రామ్‌ దానిని స్రవంతి మూవీస్‌లో చేయాలని అనుకుంటే, దిల్‌ రాజుకే చేయాలని అనిల్‌ రావిపూడి కమిట్‌ అయి వుండడంతో రామ్‌ తప్పుకున్నాడు.

తర్వాత ఈ కథ ఎన్టీఆర్‌ దగ్గరకి వెళ్లింది. కళ్యాణ్‌రామ్‌ బ్యానర్లో దిల్‌ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్‌ సిద్ధపడిపోయాడు. ఇక అనిల్‌ రావిపూడి సినిమా అనౌన్స్‌ అవడమే ఆలస్యమనుకుంటూ వుండగా, జై లవకుశ కథ విని ఎన్టీఆర్‌ అటు మొగ్గాడు. దీంతో దిల్‌ రాజు ఈ కథని ఎలాగైనా తెరకెక్కించాలని రవితేజతో ప్రాజెక్ట్‌ సెట్‌ చేసాడు.

ఈ సినిమా విడుదలకి ముందు ఈ కథని మిస్‌ చేసుకున్న హీరోలని గిల్లుతున్నాడా అన్నట్టు దీని గురించి దిల్‌ రాజు చాలా గొప్పగా మాట్లాడాడు. ఇలాంటి కథ చేయడం రవితేజ అదృష్టమన్నట్టు, కొన్ని కథలు కొంతమంది కోసమే పుడతాయన్నట్టు దిల్‌ రాజు మాట్లాడాడు.

మామూలుగా తన సినిమాల గురించి విడుదలకి ముందు ఎక్కువ మాట్లాడని దిల్‌ రాజు ఇంతగా ఎందుకు ఎక్సయిట్‌ అయ్యాడనేది చాలా మందికి బోధ పడలేదు. దీనిని మిస్‌ చేసుకుని ఆ స్థానంలో 'జై లవకుశ' చేసిన ఎన్టీఆర్‌కే బాణం వేసినట్టయింది. కాకపోతే ఈ సినిమా విడుదలై విజయవంతమయ్యాక దిల్‌ రాజు ఈ స్పీచ్‌ ఇచ్చినట్టయితే భేషుగ్గా వుండేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు