సందట్లో సడేమియా.. డిజె కూడా సిక్స్‌ అంట

సందట్లో సడేమియా.. డిజె కూడా సిక్స్‌ అంట

దిల్‌ రాజు జోరు మీదున్నాడు. ఈ ఏడాదిలో నాలుగు సినిమాలు నిర్మిస్తే అందులో మూడు ఘన విజయం సాధించాయి. ఒకటి బయ్యర్లకి నష్టాలు తెచ్చినా కానీ తనకి మాత్రం లాభాలు ఆర్జించింది. అయితే బయ్యర్లు లాభపడని సినిమాని హిట్‌ అనడానికి లేదు. అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ తీసిన డిజె యావరేజ్‌గా ఆడింది. దిల్‌ రాజు నుంచి వచ్చిన మిగతా మూడు సినిమాలు శతమానం భవతి, నేను లోకల్‌, ఫిదా పెద్ద హిట్‌ అయ్యాయి.

అయితే ఈ మూడు సినిమాలతో డిజెని కూడా కలిపేసి అన్నీ పెద్ద హిట్‌ అనేస్తున్నాడు దిల్‌ రాజు. అయిదో బాల్‌.. అంటే రాజా ది గ్రేట్‌ కూడా సిక్స్‌ కొట్టేస్తామంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే గాల్లోకి బాగా పైకి కొట్టిన మూడో బంతికి రెండు రన్సే వచ్చాయని మర్చిపోయి దానిని కూడా సిక్స్‌ కింద కౌంట్‌ చేసేస్తున్నాడు. దిల్‌ రాజుకి తన సినిమాల ఫలితం తెలీదని కాదు. సుప్రీమ్‌ తర్వాత మళ్లీ ఇలాంటి సినిమా తీయవద్దని, ఏదైనా కొత్తగా ఆలోచించమని అనిల్‌ రావిపూడికి దిల్‌ రాజు సలహా ఇచ్చాడట. దాని ఫలితంగానే రాజా ది గ్రేట్‌ కథ పుట్టిందట.

హిట్‌ అయిన సుప్రీమ్‌కే ఆ మాట అన్నాడంటే, ఇక డిజె తర్వాత హరీష్‌ శంకర్‌కి కూడా దిల్‌ రాజు అదే మాట చెప్పి వుండాలి. అందుకే తన తదుపరి చిత్రాన్ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నాడట గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు