మన హీరోలకు అమీర్ ఖాన్ ఒక లెసన్

మన హీరోలకు అమీర్ ఖాన్ ఒక లెసన్

''సీక్రెట్ సూపర్ స్టార్'' అంటూ ఒక సినిమాతో వస్తున్నాడు అమీర్‌ ఖాన్. ఆ సినిమాను తానే ప్రొడ్యూస్ చేశాడు కాని.. సినిమాలో సెంట్రల్ రోల్ మాత్రం 'దంగల్'లో చిన్నప్పటి పెద్ద కూతురు పాత్రను పోషించిన జైరా వసీం పోషిస్తోంది. ఈ సినిమాలో మనోడు ఒక మ్యూజిక్ డైరక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నిన్న ఆ అమ్మాయితో కలసి హైదరాబాద్ వచ్చాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తరువాత అమీర్ చాలా విషయాలు చెప్పాడు, వెళిపోయాడు. అయితే ఇందులో మన హీరోలకు ఉపయోగపడే పాఠాలు ఏం చెప్పాడు అంటారా. మన స్టార్ హీరోలు ఉన్నారే.. అసలు హైదారాబాద్ దాటి వెళ్లి.. ఏనాడైనా ఇతర ఊళ్ళలో ఒక ప్రెస్ మీట్ పెట్టారా? అదేమంటే.. తమిళనాడులో ఫోకస్ చేస్తున్నాం మలయాళంలో ఫోకస్ చేస్తున్నాం అంటారు కాని.. పక్కనే ఉన్న విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టరు. ఏదో ఆడియో ఫంక్షన్లను అప్పుడప్పుడూ జరుపుతారేమో కాని.. హైదారాబాద్ బౌండరీ దాటి బయటకు మాత్రం వెళ్లరు.

కాని అమీర్ ఖాన్ చూడండి.. అసలు హైదరాబాద్ అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా భారీ స్థాయిలో ఏమీ రిలీజ్ అవ్వదు.. కాని ఇక్కడున్న ఆ లిమిటెడ్ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేయాలి కాబట్టి.. ప్రెస్ మీట్ పెట్టేసి అందుకు తెలుగు పేపర్ల వారిని కూడా పిలిచాడు. చక్కగా తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్నాడు. మరి ఆ తెలివి మనకు ఎప్పుడొస్తుంది? మన స్టార్ హీరోలు ఇలా మార్కెట్ ను సుస్థిరం చేసుకోకుండా ఫ్యాన్ బేస్ ను పట్టుకునే వేలాడితే.. అదిగో.. ఎంత పెద్ద స్టార్లైనా కూడా డిజాష్టర్ల భారిన పడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English