మెగా మేనల్లుడు ఎటు వెళ్తున్నాడసలు?

మెగా మేనల్లుడు ఎటు వెళ్తున్నాడసలు?

ఇప్పుడున్న పరిస్థితుల్లో బెటర్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయకపోతే అవి ఆడట్లేదు. అలాగని కామెడీ సినిమాలు తీసేస్తే ఆడేస్తాయి అనుకుంటే.. అసలు కామెడీనే నమ్ముకున్న స్టార్లకే దిక్కులేకుండా పోయింది. మహానుభావుడు వంటి సినిమా ఆడినా.. ఆనందోబ్రహ్మను జనాలు చూసినా.. కేవలం కామెడీ వలన కాదు.. ఆ సినిమాల్లో ఇతర కంటెంట్ కూడా బలంగా ఉంది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కు ఈ సలహాలకు లింకేంటి అంటారా?

నిజానికి వరుసగా యావరేజ్ అండ్ ఎబోవ్ యావరేజ్ సినిమాలతో ఆకట్టుకున్న సాయిధరమ్ తేజ్.. ఆ తరువాత 'తిక్క' 'విన్నర్' వంటి ఐకానిక్ ఫ్లాపులను బుట్టలోవేసుకుని ఖంగుతినేశాడు. అందుకే తరువాత అతగాడు చాలా కొత్త కంటెంట్ తో రావాలని బివిఎస్ రవి డైరక్షన్లో 'జవాన్' ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ను నిర్ణియించుకోలేక ఎడిటింగ్ టేబుల్ మీద పురిటినొప్పులు పడుతోంది. ఆ తరువాత వివి వినాయక్ తో ఒక సినిమా.. అలాగే కరుణాకరన్ తో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఈ దర్శకులు ప్రస్తుతం ఫామ్ లో లేరనే చెప్పాలి. ఖైదీ నెం 150 క్రెడిట్ వినాయక్ ఖాతాలో పడకపోగా.. ఆయన అసలు కథను సరిగ్గా ఎంచుకోలేకపోతున్నాడనే అపవాదునూ ఎదుర్కొంటున్నాడు. ఇక కరుణాకరన్ కూడా ఒకటే కథను అటు తిప్పీ ఇటు తిప్పీ చెప్పడం తప్పించి కొత్తగా ఏమీ తీయకపోవడంతో.. ఆయనకు అటు సక్సెస్ లు ఇటు అవకాశాలు కరువయ్యాయ్. వీళ్ళతో సినిమా ఒప్పుకుని సంచలనం సృష్టించాడని అనుకుంటే.. ఇప్పుడు మెగా మేనల్లుడు తనకు విన్నర్ సినిమాతో ఫ్లాపును ఇచ్చిన గోపిచంద్ మలినేని డైరక్షన్లో కూడా ఒక ప్రాజెక్టును ఓకె చేసుకున్నాడట.

కబాలి వంటి ఫ్లాపు ఇచ్చిన పా.రంజిత్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ వెంటనే సినిమా చేయట్లేదా అనుకోవచ్చేమో కాని.. అక్కడ ఆయన ఆల్రెడీ సూపర్ స్టార్. మన సాయిధరమ్ ఇక్కడ ఇంకా తన మార్కెట్ ను సుస్థిరం చేసుకోవాల్సిన రైజింగ్ హీరో. కాబట్టి.. ఇలాంటి వెంచర్లన్నీ కూడా మెగా మేనల్లుడు ఎటు వెళ్తున్నాడో తెలియకుండా చేసి అభిమానులను కలవరపెడుతున్నాయి.

బివిఎస్ రవి.. వివి వినాయక్.. కరుణాకరన్.. వరుస సినిమాలు ఉన్నాయి..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు