మహేష్‌ని చూసి జాగ్రత్త పడుతున్న బన్నీ

మహేష్‌ని చూసి జాగ్రత్త పడుతున్న బన్నీ

కొత్త మార్కెట్‌కి అప్పీల్‌ అవ్వాలంటే ముందుగా స్ట్రాంగ్‌ అయిన మార్కెట్‌ని కాపాడుకోవాలి. ఈ లెక్క చూసుకోకుండా స్పైడర్‌కి మహేష్‌ తప్పుడు లెక్క వేసాడు. తమిళనాడు మార్కెట్‌ని క్యాప్చర్‌ చేసే ఆదుర్దాతో తెలుగులో తనకున్న స్టాండర్డ్‌ మార్కెట్‌ని వదిలేసాడు. ఫ్యామిలీస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ వున్న మహేష్‌ వారిని క్యాటర్‌ చేసే సినిమా కాకుండా స్పైడర్‌లాంటి సైకో థ్రిల్లర్‌ చేసాడు.

దాంతో ఫ్యామిలీస్‌ ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పడేసారు. తమిళ జనాలకి నచ్చే కాన్సెప్ట్‌ ఎంచుకోవడంతో తెలుగులో ఈ చిత్రం కంప్లీట్‌ డిజాస్టర్‌ అయింది. అటు తమిళంలో కూడా ఈ చిత్రంతో మహేష్‌ కోరుకున్న ఫలితం రాలేదు. అక్కడ కూడా ఫ్లాప్‌ అవడంతో రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలింది. ఇదంతా చూసిన అల్లు అర్జున్‌ తన బైలింగ్వల్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్నా కానీ తెలుగులో మాత్రం ఖచ్చితంగా ఇది వర్కవుట్‌ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీయమని లింగుస్వామితో మాట్లాడాడట. తమిళ ప్రేక్షకుల నాడికి తగ్గట్టు కొన్ని సీన్లు అక్కడ మార్చుకోమని, కానీ ప్రధానంగా తన తెలుగు మార్కెట్‌ని దృష్టిలో వుంచుకుని కథలో మార్పులు చేయమని చెప్పాడట.

రెండు వెర్షన్స్‌ రెడీ అయినా ఫర్వాలేదు కానీ ఒక వెర్షన్‌ వల్ల మరొకటి ఎఫెక్ట్‌ అవకుండా చూసుకోమని అనడంతో లింగుస్వామి ఆ పని మీద వున్నాడట. పక్కవాళ్ల ఫలితాలు చూసి జాగ్రత్త పడడం కూడా ఒక ఆర్టే. అన్నీ మనమే అనుభవించి చూడాలంటే వాళ్లతో పాటు మనమూ ఫెయిలవుతాంగా. గొప్ప స్ట్రాటజీ గురూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు