రామ్‌ చరణ్‌ డబ్బుల లెక్కలు కేక

రామ్‌ చరణ్‌ డబ్బుల లెక్కలు కేక

రామ్‌ చరణ్‌ ఇప్పుడు నిర్మాతగా మారడంతో అటు తను నిర్మించే సినిమాల విషయంలోనే కాకుండా, తను నటిస్తోన్న సినిమాల లెక్కల పరంగా కూడా ఖచ్చితంగా వుంటున్నాడట. ధృవ చిత్రాన్ని పారితోషికం తీసుకోకుండా తక్కువలో పూర్తి చేసిన చరణ్‌ ఆ తర్వాత లాభాల్లో వాటా తీసుకున్నాడు. ఖైదీ నంబర్‌ 150 చిత్రాన్ని చిరంజీవి పారితోషికం లేకుండా అరవై కోట్లలో పూర్తి చేసిన చరణ్‌ దాని మీద రెండింతలు సంపాదించాడు.

తర్వాత వచ్చిన లాభాల్లో తండ్రికి వాటా ఇచ్చాడునుకోండి. తర్వాత చేయబోతున్న భారీ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' విషయంలో కూడా చరణ్‌ తడబడడం లేదట. అన్ని కోట్ల ప్రాజెక్ట్‌ అయినప్పటికీ అతను ఫైనాన్స్‌ వ్యవహారాలపై చూపిస్తోన్న గ్రిప్‌ చూసి అందరూ షాక్‌ అవుతున్నారట. ఇదిలావుంటే తను హీరోగా నటిస్తోన్న 'రంగస్థలం 1985' సినిమాకి కూడా ఓవర్‌ బడ్జెట్‌ కాకుండా చరణ్‌ పర్సనల్‌ కేర్‌ తీసుకుంటున్నాడట.

ప్రతి షెడ్యూల్‌కి అయ్యే ఖర్చు ఎంత, ఏమిటి అని చూసుకుంటూ నిర్మాతల భారం తగ్గిస్తున్నాడట. చరణ్‌ చూపిస్తోన్న శ్రద్ధ వల్ల ఈ సినిమా బడ్జెట్‌ కంట్రోల్‌లో వుంటోందని, తన మార్కెట్‌కి అనుగుణంగా ప్లాన్‌ చేయడమే కాకుండా, ఈ సినిమాని అధిక ధరలకి అమ్మకుండా కూడా చరణ్‌ జాగ్రత్త పడుతున్నాడట.

తన సినిమా కొనే బయ్యర్లకి నష్టాలు రాకుండా చరణ్‌ ఈ జాగ్రత్తలు పాటిస్తున్నాడని, ఎలా చూసినా ఈ సినిమాపై నిర్మాతలు కనీసం ముప్పయ్‌ శాతానికి పైగా లాభాలు విడుదలకి ముందే వెనకేసుకుంటారని ఇండస్ట్రీ టాక్‌. మిగతా హీరోలంతా చరణ్‌లా ఆర్థిక వ్యవహారాల మీద కూడా దృష్టి పెడితే అంతంత పెద్ద డిజాస్టర్లు రావు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు