రాజు గారి గది-2 స్పెషల్ అదే..

రాజు గారి గది-2 స్పెషల్ అదే..

ఇటు తెలుగులో.. అటు తమిళంలో పదుల సంఖ్యలో హార్రర్ కామెడీలు వచ్చాయి. ఐతే అవన్నీ కూడా చిన్న, మీడియం రేంజి హీరో హీరోయిన్లు నటించిన సినిమాలే. మొదట్నుంచి ఈ జానర్లో చిన్న స్థాయి సినిమాలే తెరకెక్కాయి. స్టార్లు ఈ జానర్‌ను తక్కువగానే చూస్తూ వచ్చారు.

ఐతే కొన్నేళ్ల కిందటే ఔట్ డేట్ అయిపోయినట్లు కనిపించిన ఈ జానర్‌ను చాలా ఆలస్యంగా ఇప్పుడు ఒక స్టార్ హీరో టచ్ చేశాడు. ఆయనే అక్కినేని నాగార్జున. ఇటు తెలుగులో అయినా.. అటు తమిళంలో అయినా నాగార్జున స్థాయి స్టార్ హీరో హార్రర్ కామెడీలో నటించడం ఇదే తొలిసారి. అందుకే ‘రాజు గారి గది-2’ మీద జనాల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. నాగ్‌తో పాటుగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ సైతం ఈ సినిమాలో నటించింది.

ఎన్నడూ లేని విధంగా ఇద్దరు బడా స్టార్లు ఓ హార్రర్ కామెడీలో నటించిన నేపథ్యంలో ‘రాజు గారి గది-2’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే హార్రర్ కామెడీలు మళ్లీ ఊపందుకునే అవకాశముంది. ఓంకార్ ‘రాజు గారి గది’ ఫ్రాంఛైజీని అలాగే కొనసాగించేందుకు, ఇందులో వెంకీని పెట్టి మూడో భాగం తీసేందుకు అవకాశం లభిస్తుంది. సౌత్ ఇండియాలో మరిన్ని హార్రర్ కామెడీలు తెరకెక్కడానికి, అందులో మరిందరు స్టార్లు నటించడానికి కూడా అవకాశముంటుంది. మరి ‘రాజు గారి గది-2’ ఎలాంటి పలితాన్నందుకుంటుందో చూడాలి.

ఈ సినిమాలో నాగ్ పాత్ర కంటే కూడా సమంత మీద జనాల ఫోకస్ ఎక్కువ కనిపిస్తోంది. సమంత దెయ్యంగా నటించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె పాత్ర గురించి, నటన గురించి చిత్ర బృందం గొప్పగా చెబుతోంది. మరి సమంత అంతలా ఏం చేసేసిందో చూడాలి. పీవీపీ నిర్మించిన ఈ చిత్రంలో అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీత దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English