హైబ్రిడ్ పిల్ల‌ 'తెలుగు' సినిమాలు చేయ‌దా?

హైబ్రిడ్ పిల్ల‌ 'తెలుగు' సినిమాలు చేయ‌దా?

ఏమాత్రం అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఫిదా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా 90 కోట్లు వ‌సూలు చేసి 100 కోట్ల క్ల‌బ్ కు చేరువ‌లో ఉంది. శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ చిత్రంగా విడుద‌లైన ఫిదాను సాయి ప‌ల్ల‌వి త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఓ రేంజ్ హిట్ గా నిలిపింది. ఈ హైబ్రిడ్ పిల్ల పర్ ఫార్మ‌న్స్ కు ప్రేక్ష‌కుల‌తో పాటు టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫిదా అయ్యారు. ఆ సినిమా త‌ర్వాత సాయి ప‌ల్ల‌వికి తెలుగులో చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఫిదాకు ముందు క‌మిట్ అయిన ఎంసీఏ సినిమాలో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. అది మిన‌హా మ‌రే తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

తెలుగులో న‌టించిన తొలి చిత్రంతోనే సాయి ప‌ల్ల‌వి స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ను అందుకుంది. దీంతో, ఆమె ఆ స్టార్ స్టేట‌స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. ఎంసీఏ షూటింగ్ కు సాయి ప‌ల్ల‌వి లేట్ గా వ‌స్తోంద‌ని, అదీగాక నానితో ఆమెకు విభేదాలు వ‌చ్చాయ‌ని పుకార్లు వ‌చ్చాయి. ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల నాని కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు గాసిప్స్ వ‌చ్చాయి. దీంతో, ప్ర‌స్తుతం ఆమె తెలుగు సినిమాలు చేసే ఉద్దేశంతో లేదనే వార్త‌లు టాలీవుడ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తమిళంలో 'కరు' .. 'మారి 2' సినిమాలకు ఓకే చెప్పింది. తాను న‌టించిన తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో విడుదలయ్యేలా సాయి ప‌ల్ల‌వి ప్లాన్ చేస్తోంద‌ని టాక్. దుల్క‌ర్ స‌ల్మాన్ , సాయి ప‌ల్ల‌వి ల కాంబోలో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం కాళి తెలుగులో హేయ్ పిల్ల‌గాడా పేరుతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. సాయి ప‌ల్ల‌విపై వ‌స్తున్న పుకార్ల‌లో నిజ‌మెంతో తెలియాలంటే మ‌రి కొంత‌కాలం వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు