అక్రమ సంబంధం వ్యవహారంలో హీరోయినే దోషి!

అక్రమ సంబంధం వ్యవహారంలో హీరోయినే దోషి!

హృతిక్‌ రోషన్‌ తనతో ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేసాడంటూ కంగన రనౌత్‌ చేసిన రచ్చతో అతను బయటకి రాక తప్పలేదు. తమ మధ్య ఏం జరిగిందో, అసలు తనకి కంగన ఎంతవరకు పరిచయమో, ఆమెతో తనకున్న ఇంటరాక్షన్‌ ఏమిటో హృతిక్‌ వివరించి చెప్పాడు. ముందుగా బహిరంగ లేఖ రాసిన హృతిక్‌ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈ వ్యవహారం గురించి కుండ బద్దలు కొట్టాడు.

హృతిక్‌ మాట్లాడకపోవడంతో కంగన నాలుగేళ్ల పాటు మీడియా ముందుకొచ్చి రచ్చ రచ్చ చేసింది. హృతిక్‌ ఎలాంటి మొహమాటం లేకుండా జరిగింది చెప్పడమే కాకుండా ఆమెని ఎక్స్‌పోజ్‌ చేయడంతో అసలు ఏమి జరిగిందో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కంగన దీనిపై స్పందించకపోయినా ఆమె అక్క మాత్రం హృతిక్‌పై అభియోగాలు చేస్తూనే వుంది.

కానీ ఆమె వద్ద కూడా సాలిడ్‌ ఆధారాలు లేకపోవడంతో ఈ రనౌత్‌ సిస్టర్స్‌ ఎవరో ఇమ్‌పోస్టర్‌ని హృతిక్‌ అనుకుని భ్రమపడి ఇందాకా తెచ్చుకున్నారని తేలిపోయింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా హృతిక్‌కే బాసటగా నిలిచింది. ఫెమినిస్ట్‌ కార్డు వాడుతోన్న కంగనకి వారి వైపు నుంచి కూడా మద్దతు తగ్గిపోయింది.

ఆమె ఆరోపణలకి ఆధారాలు లేకపోవడం, హృతిక్‌ మాటల్లో నిజాయతీతో పాటు, లాజిక్‌ కూడా వుండడంతో ప్రస్తుతానికి కంగన దోషిగా కనిపిస్తోంది. ఆమె ఏదైనా ప్రూఫ్‌ తీసుకొస్తే తప్ప ఈ బ్యాడ్‌ ఇమేజ్‌ ఆమెని చాలా కాలం వెంటాడడం గ్యారెంటీ అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English