పాపం ఆమెని మళ్లీ పీకేసారు

పాపం ఆమెని మళ్లీ పీకేసారు

క్యాధరీన్‌కి మరోసారి చుక్కెదురైంది. అసలే ఎక్కువ అవకాశాలు లేక ఆఫర్ల కోసం ఎదురు చూస్తోన్న క్యాధరీన్‌కి చేతికి వచ్చినవి కూడా చేజారిపోతున్నాయి. సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి లాంటి హిట్‌ సినిమాలు తన ఖాతాలో వున్నా కానీ క్యాధరీన్‌కి ఇంకా స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ లేదు.

రెండో హీరోయిన్‌ పాత్రలకి ఓకే కానీ మెయిన్‌ లీడ్‌గా మాత్రం తనకి అవకాశాలివ్వడం లేదు. రవితేజ హీరోగా రూపొందే బోగన్‌ రీమేక్‌లో క్యాధరీన్‌నే హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమెతో మాటా మంతీ కూడా అయిపోవడంతో ఆమె మీడియాకి కూడా ఈ సంగతి చెప్పుకుంది. కానీ క్యాధరీన్‌కి హీరోయిన్‌గా ఎలాంటి స్టార్‌ వేల్యూ లేదని భావించి, ఆమె స్థానంలో కాజల్‌కి ఆ పాత్ర ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారట.

మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తే తప్ప ఆమె ఇలాంటి ఆఫర్లని నిలుపుకోలేదు. కాజల్‌ ఎంత సీనియర్‌ అయినా కానీ ఆమె హీరోయిన్‌ అనేసరికి ఆ ప్రాజెక్ట్‌కి వెయిట్‌ పెరుగుతుంది. అలాగే యంగ్‌ హీరోయిన్లలో కొందరు వచ్చీ రావడంతోనే స్టార్స్‌ అవుతున్నారు. కానీ క్యాథీకి మాత్రం కాలం కలిసి రావడం లేదు.

ప్రస్తుతానికి వ్యాంప్‌ తరహా పాత్రలు, ఐటెమ్‌ సాంగులే ఆమెని వరిస్తున్నాయి. ఖైదీ నంబర్‌ 150లో ఆ రత్తాలు పాట కైవసం చేసుకుని వుంటే అదేమైనా దశ తిప్పి వుండేదేమో కానీ ఇప్పుడు క్యాధరీన్‌కి ఆఫర్లు రావడమే గగనంగా వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు