దంచుకునేందుకు మంచి ఛాన్స్

దంచుకునేందుకు మంచి ఛాన్స్

‘జై లవకుశ’ జోరు కొన్ని రోజుల ముందే తగ్గిపోయింది. ‘స్పైడర్’ కథ కూడా ఎప్పుడో ముగిసింది. దసరా విన్నర్ ‘మహానుభావుడు’ కూడా డల్లయిపోయింది. ఇక గత వారాంతంలో అయితే చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. మొత్తంగా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ స్తబ్దుగా ఉంది.

ఇప్పుడు రేసులోకి దిగే సినిమాకు వసూళ్ల పంట పండే అవకాశముంది. ఈ సమయంలోనే అక్కినేని నాగార్జున సినిమా ‘రాజు గారి గది-2’ థియేటర్లలోకి దిగుతోంది. ఓ మోస్తరు బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాను ఓ భారీ సినిమా స్థాయిలో రిలీజ్ చేసుకునే సౌలభ్యం నిర్మాతలకు దొరికింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1200 థియేటర్లలో ‘రాజు గారి గది-2’ రిలీజవుతుండటం విశేషం.

ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ పెద్దగా చేయకున్నా.. హైప్ మరీ ఎక్కువ లేకపోయినా.. బుకింగ్స్ మాత్రం బాగున్నాయి. మంచి ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమా మీద జనాల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. పైగా నాగార్జున-సమంత మామా కోడళ్లుగా మారాక వెంటనే వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హార్రర్ కామెడీ అంటేనే మినిమం గ్యారెంటీ అనే ఫీలింగ్ కూడా జనాల్లో ఉండటం కలిసొస్తున్న అంశం. మొత్తంగా మంచి టైమింగ్‌లో, సానుకూల వాతావరణంలో రిలీజవుతున్న ‘రాజు గారి గది-2’ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశముంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నిర్మాతలు, బయ్యర్లకు భారీగా లాభాలందే అవకాశముంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.24 కోట్లకే అమ్మారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English