నానికి బదులిచ్చింది.. ఇక శర్వాతో

నానికి బదులిచ్చింది.. ఇక శర్వాతో

స్టార్ హీరోల్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం తెలుగులో ఉన్న యువ కథానాయకుల్లో పెర్ఫామెన్స్ పరంగా తిరుగులేని కథానాయకులంటే నాని, శర్వానంద్ అనే చెప్పాలి. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తూ తమదైన ముద్ర వేయగల నటులు వీళ్లిద్దరూ. వీళ్ల టాలెంట్ ఏంటో చెప్పడానికి చాలా సినిమాలే ఉన్నాయి.

ఈ ఇద్దరితో నటించడం హీరోయిన్లకు కూడా సవాలే. పెర్ఫామెన్స్ పరంగా వాళ్ల ముందు చాలా మంది హీరోయిన్లు తేలిపోతుంటారు. ముఖ్యంగా నాని.. హీరోయిన్లకు ఛాన్సే ఇవ్వడసలు. ఐతే ఈ మధ్య ఒక హీరోయిన్ అతడి ముందు దీటుగా నిలిచింది. నానితో పోటాపోటీగా నటించింది. ఆ అమ్మాయే.. నివేదా థామస్.

‘జెంటిల్‌మన్’, ‘నిన్ను కోరి’ సినిమాల్లో నానికి ఏమాత్రం తీసిపోని విధంగా నటించి మార్కులు కొట్టేసింది నివేదా. ఇక ఆమె శర్వానంద్‌‌తో జత కట్టడానికి సిద్ధమవుతుండటం విశేషం. ‘స్వామి రారా’.. ‘కేశవ’ చిత్రాల దర్శకుడు శర్వానంద్ ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తాడట. అతను ద్విపాత్రాభినయం చేయబోతున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుంటారట. అందులో ఒకరు నివేదా థామస్ అట. శర్వా-నివేదా జోడీ అంటే పెర్ఫామెన్స్ ఇరగదీస్తారనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు. ఇంకొన్ని రోజుల్లోనే చిత్రీకరణ మొదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు