ఆ పిల్లాడితో బాహుబలిని కొట్టిస్తారా??

ఆ పిల్లాడితో బాహుబలిని కొట్టిస్తారా??

'బాహుబలి' సినిమా బాలీవుడ్ ను బాగా డిస్ర్టబ్ చేసింది. అంత పెద్ద హిట్ ఇంత పెద్ద హిట్ అంటూనే అక్కడి జనాలు అసలు ఇలాంటి సినిమా మనం తీయలేకోయాం అంటూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ తరువాత చాలా సినిమాలు.. బాహుబలి ఏముందబ్బా కొట్టేస్తాం అన్నట్లు ఛాలెంజ్ చేశాయి కాని.. ఒక్క సినిమా కూడా వర్కవుట్ చేయలేకపోయింది. బాహుబలి అంటే ఆషామాషీ కాదని అప్పుడే వారికి అర్దమైంది. ఆ తరువాత బాహుబలి 2 క్రియేట్ చేసిన ప్రభంజనంతో.. బాలీవుడ్ అవాక్కైపోయిందిలే.

అందుకే ఎప్పటికప్పుడు బాహుబలి సినిమాలను బీట్ చేసే ధీటైన సినిమా ఒకటి చేయాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే ఏకంగా బాహుబలిని మార్కెటింగ్ చేసిన కరణ్‌ జోహార్ రంగంలోకి దిగాడు. వేకప్ సిడ్ మరియు ఏ జవానీ హై దివానీ వంటి సినిమాలను తీసిన అయాన్ ముఖర్జీ గుర్తున్నాడా? చిన్నతనంలోనే డైరక్టర్ అయిపోయిన ఈ కాజోల్ కజిన్.. ఇప్పుడు ఒక ఫాంటసీ సినిమాను రూపొందిస్తున్నాడు. సినిమా టైటిల్ ''బ్రహ్మాస్ర్తం'' కాగా.. ఇది మూడు పార్టులుగా రిలీజ్ కానుంది. పైగా ఇందులో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ వంటి స్టార్ క్యాస్టింగ్ అంతా ఉంది. నిన్ననే సినిమాను ప్రకటించిన కరణ్‌ జోహార్, ఆగస్టు 15, 2019న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు.

అయితే ఇప్పటివరకు అయాన్ ముఖర్జీ యాక్షన్ ఎపిసోడ్లతో కూడిన ఒక్క సినిమాను కూడా తీయలేదు. అన్నీ కూడా లవ్ స్టోరీలే తీశాడు. అలా చూస్తే.. బాహుబలి వంటి మ్యాజిక్ ను రిపీట్ చేసి ఆ సినిమా రికార్డులు కొట్టేయడం ఈ పిల్లాడి వలన అవుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు