చిరంజీవి ఫీటు మామూలుది కాదు

చిరంజీవి ఫీటు మామూలుది కాదు

ఖైదీ నంబర్‌ 150 చిత్రంతో వంద కోట్ల షేర్‌ని చిరంజీవి సాధిస్తే, ఇకపై ఇది మామూలైపోతుందని చెప్పుకున్నారు. ఇక నుంచి వచ్చే పెద్ద సినిమాలన్నీ అవలీలగా వంద కోట్ల మార్కు దాటతాయని అంచనా వేసారు. అందుకు తగ్గట్టే తెలుగు సినిమా మార్కెట్‌ లెక్కలు కూడా బాగా పెరిగాయి. ఏ పెద్ద సినిమా వచ్చినా ఎనభై కోట్లకి పైగానే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అవుతోంది.

అయితే వంద కోట్ల షేర్‌ రావడం అంత ఈజీ కాదనేది ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాలు తెలియజెప్పాయి. పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఇలా అందరి సినిమాలు రిలీజ్‌ అయినా కానీ చిరంజీవి సాధించిన వసూళ్లు తెచ్చుకోవడం ఎవరి వల్ల కాలేదు. అయితే వీరందరికీ ఫ్లాప్‌ లేదా యావరేజ్‌లు పడడం వల్లే వంద కోట్లు రాలేదని మాత్రం అంగీకరించాలి. పవన్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల సినిమాలకి టాక్‌ బాలేకపోయినా కానీ ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి.

సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే వంద కోట్ల షేర్‌ ఈజీగానే వచ్చేసి వుండేది. ఏదేమైనా ఇక ఈ ఏడాదిలో రావాల్సిన భారీ చిత్రాలేమీ లేవు కనుక బాహుబలి 2ని మినహాయిస్తే వంద కోట్ల షేర్‌ సాధించిన సినిమాగా ఖైదీ నంబర్‌ 150 రికార్డు చిరకాలం మిగిలిపోతుంది. ఈ సంక్రాంతికి అన్నయ్య సాధిస్తే, వచ్చే సంక్రాంతికి తమ్ముడు 'అజ్ఞాతవాసి'గా సాధిస్తాడని ఫాన్స్‌ ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు