ఎన్టీఆర్‌ గురించి పెదవి విప్పని జగన్‌

ఎన్టీఆర్‌ గురించి పెదవి విప్పని జగన్‌

మామూలుగా కాంట్రవర్సీలకి దూరంగా వుండే పూరి జగన్నాథ్‌ 'జై లవకుశ' టీజర్‌ రిలీజ్‌ అయినపుడు మాత్రం 'జై' క్యారెక్టర్‌ తను చెప్పిన కథలోంచి కాపీ కొట్టారని ఆరోపించాడు. ఎన్టీఆర్‌ని అంత మాట అనేసి మళ్లీ దాని గురించి జగన్‌ ఎక్కడా వివరణ కూడా ఇవ్వలేదు. పైసావసూల్‌ ఇంటర్వ్యూల్లో కూడా ఆ టాపిక్‌ రానివ్వలేదు. జై లవకుశ రిలీజ్‌ అయిన ఇన్ని రోజులకి కూడా ఇంకా పూరి జగన్నాథ్‌ నుంచి దానిపై వివరణ లేదు.

అసలు ఈ చిత్రం పూరి చూసాడా, చూస్తే ఇది తను చెప్పిన కథలోంచి కాపీ కొట్టిన క్యారెక్టరేనా అన్నది పూరి చెప్పనే లేదు. ఈ చిత్రానికి మాత్రం జై పాత్రే హైలైట్‌ అయి, ఇంతవరకు వచ్చిన వసూళ్లకి అదే ప్రధాన కారణంగా నిలిచింది. ఈ సినిమాకి వచ్చిన టాక్‌కి ఎక్కువ నష్టమే వస్తుందని అనుకున్నారు కానీ ఫైనల్‌గా జై లవకుశ స్వల్ప నష్టాలతో గట్టెక్కిపోతోంది.

బాబీ లాంటి ఇమేజ్‌ లేని డైరెక్టర్‌తో చేసిన యావరేజ్‌ సినిమాని కూడా ఎన్టీఆర్‌ ఇంత దూరం లాగేసరికి అతడి పట్ల ట్రేడ్‌లో మరింత నమ్మకం పెరిగింది. ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా చేసినట్టయితే దాని రిజల్ట్‌ మెరుపులు మెరిపిస్తుందనే కామెంట్లు ట్రేడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు