‘ఫిదా’ 90 దగ్గర ఆగింది

‘ఫిదా’ 90 దగ్గర ఆగింది

ఈ దసరాకు విడుదలైన ‘స్పైడర్’ సినిమా బడ్జెట్ రూ.125 కోట్లు. బిజినెస్ రూ.156 కోట్ల దాకా జరిగింది. కానీ తీరా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ తేవడానికి కూడా ఆపసోపాలు పడిపోయిందీ సినిమా. చిత్ర నిర్మాతలు ప్రకటించినట్లు ‘స్పైడర్’ రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఉన్నా అదేమీ గొప్ప కాదు.

కానీ రెండు నెలల కిందట చిన్న సినిమాగా విడుదలైన ‘ఫిదా’ ఫుల్ రన్లో ఏకంగా రూ.90 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇదీ గొప్ప విషయం. రూ.10 కోట్లు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. థియేట్రికల్ హక్కుల్ని అమ్మింది కూడా రూ.18 కోట్లకే. కానీ ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.48 కోట్ల షేర్.. రూ.90 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.37 కోట్లకు పైగా షేర్.. రూ.68 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ నటించిన ‘జై లవకుశ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా నైజాం ఏరియాలో రూ.16బ కోట్లకు అటు ఇటుగా షేర్ రాబట్టగా.. ‘ఫిదా’ ఆ ఏరియాలో ఏకంగా రూ.18 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా నిలిచింది.

యుఎస్‌లో ‘ఫిదా’ ఏకంగా మిలియన్ క్లబ్బును దాటేసింది. కర్ణాటకలోనూ ఈ చిత్రం రూ.6 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. కేవలం థియేట్రికల్ రన్‌తోనే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన ‘ఫిదా’ శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కుల ద్వారా మరింతగా నిర్మాత దిల్ రాజుకు ఆదాయం తెచ్చిపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు