ఫస్ట్ లుక్ : చి: ల: సౌ:

ఫస్ట్ లుక్ : చి: ల: సౌ:

టాలీవుడ్లో ఒక ఆసక్తికర కాంబినేషన్‌కు తెర లేచింది. ఒక యువ కథానాయకుడు మరో యువ కథానాయకుడి దర్శకత్వంలో నటించబోతున్నాడు. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా.. దర్శకుడిగా మారుతున్న హీరో రాహుల్ తో సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే ఆ సినిమా ఈ రోజే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు ‘చి: ల: సౌ:’ అంటూ ఆసక్తికర టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్‌ను బట్టి చూస్తే ఇది కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలా అనిపిస్తోంది.

ఐతే ఈ పోస్టర్లో నటీనటులెవరూ లేరు. పౌరాణిక చిత్రంలోని ఒక ఘట్టం తరహాలో ఉంది ఈ దృశ్యం. ఈ చిత్రాన్ని భరత్ కుమార్ మలసాల, హరి పులిజల, జశ్వంత్ నడిపల్లి అనే కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిల్ రాజు విడుదల చేసిన ‘వెళ్లిపోమాకే’ అనే చిన్న సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు.

‘అందాల రాక్షసి’ సినిమాతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత ‘అలా ఎలా’తో హిట్టు కొట్టాడు. ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. త్వరలోనే ‘హౌరా బ్రిడ్జ్’ అనే సినిమాతో అతను పలకరించబోతున్నడు. ఐతే నటుడిగా కెరీర్ ఏమంత ఊపందుకోని సమయంలో అతను అనూహ్యంగా దర్శకుడిగా మారాడు. ఇక సుశాంత్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటిదాకా హీరోగా చేసిన నాలుగు సినిమాలూ (కాళిదాసు, కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా) ఫ్లాపులే. మరి రాహుల్ అయినా అతడికి హిట్టిస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English