శర్వానంద్‌కి ఇదేమి సరదానో?

శర్వానంద్‌కి ఇదేమి సరదానో?

వరుస విజయాలు సాధిస్తూ హీరోగా తన రేంజ్‌ మరింత పెంచుకుంటూ పోతున్న శర్వానంద్‌కి ఒక కోరిక అలా మిగిలిపోయిందట. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో నటించాలనేది అతని కల అట. అతని సినిమాల్లో హీరోలని చాలా డిఫరెంట్‌గా చూపిస్తాడని, ఆ స్టయిల్‌ తనకి నచ్చుతుందని, పూరితో సినిమా చేస్తే ఖచ్చితంగా తనని డిఫరెంట్‌గా చూపిస్తారని, ఆయనతో పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని పత్రికాముఖంగా తన కోరిక వెలిబుచ్చాడు.

కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయకుండా విసిగిస్తోన్న పూరి జగన్నాథ్‌కి ప్రస్తుతం హీరోలు దొరకడం లేదు. మంచి ఊపు మీదున్న శర్వానంద్‌తో సినిమా అంటే పూరి ఇప్పుడు మిస్‌ చేసుకోకపోవచ్చు. కానీ జగన్‌తో సినిమా చేయాలనే సరదా కోసం ప్రస్తుతం అతను తీస్తోన్న సినిమాలెలా వున్నాయనేది కూడా లెక్క చేయకుండా శర్వానంద్‌ ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే అదే పనిగా గుడ్‌ బాయ్‌ లేదా కామెడీ పాత్రలు చేస్తోన్న శర్వానంద్‌కి కూడా మొనాటనీ వచ్చేసి వుండాలి. అందుకే పూరి మార్కు హీరోయిజంతో డిఫరెంట్‌గా కనిపించాలని చూస్తున్నాడు. అంత రిస్క్‌ చేసే బదులు సింపుల్‌గా నేను లోకల్‌లాంటి సినిమా సెట్‌ చేసుకుంటే పోతుంది కదా అని నెటిజన్లు సలహాలిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు