మహేష్‌బాబు కోలుకున్నాడు

మహేష్‌బాబు కోలుకున్నాడు

స్పైడర్‌ పరాజయం పాలవడంతో మహేష్‌బాబు చాలా నిరాశ చెందినట్టు వార్తలొచ్చాయి. మామూలుగా తన సినిమా ఏది ఫెయిలైనా కానీ మహేష్‌ చాలా డిప్రెస్‌ అవుతాడట. అలాగే స్పైడర్‌కి కూడా మహేష్‌ డిజప్పాయింట్‌ అయ్యాడని అనుకున్నారు కానీ ఈ చిత్రంపై చాలా నమ్మకమే వుండడంతో అతను చాలా రోజుల పాటు కోలుకోలేదట. ఏడాదిన్నర సమయం కేటాయించిన ఈ చిత్రం తప్పకుండా తనకి ఘన విజయాన్ని అందిస్తుందని మహేష్‌ నమ్మాడు. అదేమో బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొట్టింది.

దీంతో సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకే రాని మహేష్‌ కనీసం ట్విట్టర్లో కూడా ఆ సినిమా గురించి ఒక మాట మాట్లాడలేదు. అయితే సినిమా పరాజయం నుంచి కోలుకున్న తర్వాత మాత్రం తన టీమ్‌తో కలిసి ఎక్కడ రాంగ్‌ అయిందని విశ్లేషించుకున్నాడని, ఈ చిత్రం రిలీజ్‌ అయిన రోజు సోషల్‌ మీడియాలో జరిగిన నెగెటివ్‌ ప్రచారంపై దృష్టి పెట్టాడని, రెండు వెబ్‌సైట్ల మీద కంప్లయింట్స్‌ కూడా దాఖలయ్యాయని వినిపిస్తోంది.

ఇదిలావుంటే చైతన్య, సమంతల పెళ్లికి విషెస్‌ అందించిన మహేష్‌ తాజాగా రాజమౌళి బర్త్‌డేకి కూడా విషెస్‌ చెబుతూ ట్వీట్‌ పెట్టాడు. రాజమౌళి తీసే తదుపరి చిత్రానికి తదుపరి చిత్రం మహేష్‌తోనే ఖరారయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు