రకుల్‌ని ఇబ్బంది పెట్టిన మెగా హీరో

రకుల్‌ని ఇబ్బంది పెట్టిన మెగా హీరో

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బర్త్‌డేకి మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆమె ఆఫ్‌ లొకేషన్‌ ఫోటో ఒకటి పెట్టి బర్త్‌డే విషెస్‌ అందించాడు. నిద్రలోకి జారుకుని నోరు తెరిచి పడుకున్న రకుల్‌ ఆ ఫోటోలో భలే కామెడీగా వుంది. పక్కనే తేజ్‌ కూడా ఆమెని వెక్కిరిస్తూ ఆ ఫోటోలో కనిపించాడు. అతను అందించిన కొంటె విషెస్‌కి రకుల్‌ థాంక్స్‌ చెప్పినా కానీ ఆ ఫోటో పెట్టిన ఇబ్బందిని మాత్రం దాచలేకపోయింది.

ఆ ఫోటోలో రకుల్‌ ఎక్స్‌ప్రెషన్‌ మరీ తేడాగా వుండేసరికి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ బాగానే జరుగుతోంది. మామూలుగా అయితే ఈ ఫోటో అసలు బయటకి వచ్చేదే కాదు. కానీ సాయిధరమ్‌ తేజ్‌ తన కొంటెతనం బయటపెట్టడంతో ఈ ఆఫ్‌ స్క్రీన్‌ షాట్‌ పబ్లిక్‌ అయిపోయింది. హీరోయిన్లని ఓ రేంజ్‌లో ఊహించుకునే అభిమానులకి వారు ఇలా ఆక్వర్డ్‌గా కనిపిస్తే అంత నచ్చదు.

ఇలాంటివి బయటకి రాకుండా హీరోయిన్లు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు కానీ సాయి ధరమ్‌ తేజ్‌లాంటి కొంటె కుర్రాళ్ల చేతిలోకి ఇలాంటివి వెళితే ఇలాగే అవుతుంది మరి. వీరిద్దరూ కలిసి విన్నర్‌ సినిమాలో నటించారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగానే వుందని వారి కాన్వర్‌జేషన్‌ చూస్తే తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు