పాపం ఆది.. హిట్టు కోసం అలా..

పాపం ఆది.. హిట్టు కోసం అలా..

ఈ మధ్యాకాలంలో ఆడియో ఫంక్షన్లలో ఎవరే మాట్లాడినా కూడా వాటిపై నెటిజన్ల స్ర్కూటినీ అనండీ.. లేదా ఫిలిం ఇండస్ర్టీ రియాక్షన్ అనండి.. కాస్త ఎక్కవగానే ఉంటోంది. పైగా అలాంటి మాటల వలన కొన్ని కొన్ని నిజాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అదిగో మొన్న ''నెక్ట్స్ నువ్వే'' సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు చేసిన అలాంటి కామెంట్లే ఇప్పుడు ఒక యంగ్ హీరో గురించి కొన్ని విషయాలు బయటపెట్టాయ్.

ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన బన్నీ వాసు.. ''ఈ సినిమా కోసం ఆది కి రెమ్యూనరేషన్ ఎంతివ్వాలి అని సాయికుమార్ గారిని అడిగినప్పుడు.. ముందు మావాడికి మంచి సినిమా ఇవ్వు.. తరువాత పది రూపయాలు ఇచ్చినా చాలు అన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా ఈ సినిమా చేశాడు ఆది. రిలీజయ్యాక తనకు రెమ్యూనరేషన్ ఇస్తాను. తప్పించుకోను'' అంటూ సెలవిచ్చాడు. మామూలుగా సక్సెస్ లో ఉన్న యంగ్ హీరోతో సినిమా చేయాలంటే.. ఎంతోకొంత అడ్వాన్స్ ఇవ్వాలి. రిలీజ్ కు ముందు బ్యాలెన్స్ అంతా తీర్చేయాలి. కాని ఆది విషయంలో మాత్రం.. అతనికి సక్సెస్ లేకపోవడం వలనే కదా.. అతనూ పైసల్ డిమాండ్ చేయలేదూ.. నిర్మాతలూ పైసల్ ఇవ్వనిది. అదే విషయం ఆ ఆడియో ఫంక్షన్లో డైరక్టుగా బయటపెట్టినట్లు అయ్యింది.

నిజానికి చాలామంది యంగ్ హీరోలకంటే ఆది దగ్గర చాలా టాలెంటే ఉంది. డైలాగ్ డెలివరీ అండ్ డ్యాన్స్ బాగుంటాయి. కాని ఎందుకో మనోడికి హిట్టు పడట్లేదు. దానితో ఇలా డబ్బులు కూడా తీసుకోకుండా సినిమాలు చేయాల్సి వస్తోంది. ఆ మధ్యన సాయికుమార్ తన సొంత డబ్బులను కూడా ఆదిపై ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నాడు. మరి ఈటివి ప్రభాకర్ తీసే ఈ సినిమాతోనైనా ఆది ఫేట్ మారుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు