తమన్నా తడుస్తోంది.. రెడీగా ఉండండే

తమన్నా తడుస్తోంది.. రెడీగా ఉండండే

ఒకప్పుడు వాన పాటలంటే ఒక రకమైన క్రేజ్ ఉండేది. అందుకే 'ఆకు చాటు పిందె తడిచే' 'వానా వానా వెల్లువాయే' 'స్వాతిముత్యపు జల్లులలో' వంటి పాటలు అంత పెద్ద హిట్టయ్యాయ్. క్రమేపి ఈ పాటలకు క్రేజ్ తగ్గిపోయింది అనుకుంటున్న వేళ.. అసలు వాన పాటలంటే మిల్కీ బ్యూటి తమన్నా ఉండాల్సిందే అన్నంత హైప్ వచ్చేసింది. ఎందుకంటే ఆవారా సినిమాలో ఆమె చేసిన ఒక వాన సాంగ్ గ్లామర్ కోటకు కొత్త రోడ్డు వేస్తే.. ఇక రచ్చ సినిమాలో చిరంజీవి పాత పాటను రీమిక్స్ చేయగా అందులో కొత్తగా చేరిన మిల్కీ అందాలు రొమాంటిక్ గీతాల స్థాయిని ట్రంప్ టవర్ అంత ఎత్తుకు తీసుకెళ్ళాయ్.

అదిగో ఆ తరువాత రవితేజతో కలసి ఓ వానపాట చేసింది తమన్నా. కాకపోతే ఈసారి వాన ఎక్కువైపోయి ఆమె వయ్యారాలను పట్టించుకే నాదుడే లేకపోయాడు. అయినాసరే ఆ సినిమా ఆడటంలో ఆ పాట కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీకి ఛాన్సులు తగ్గిపోయాయ్ అనుకుంటున్నవేళ.. అమ్మడు రెమ్యూనరేషన్ తగ్గించుకుని ఇప్పుడు చిన్న చిన్న హీరోలతో కూడా చేస్తోంది. ఆ కోవలోనే కళ్యాణ్‌ రామ్ తో కొత్త సినిమాకు ఓకె చెప్పింది. ఈ సినిమాలో ‘చినికి చినికి వలపు వాన తడి...’ అంటూ సాగే పాటలో అమ్మడు మరోసారి వాన జల్లులలో తడిసిపోతున్న అందాల జాతరను ఆరబోయనుందట.

మొత్తానికి ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతున్న తమన్నా.. వాన పడినా పడికపోయినా తన గ్లామర్ ఎటాక్ తో బాగానే మురిపిస్తోంది. బహుశా అందుకే ఆమె ఇండస్ర్టీకి వచ్చి పన్నెండేళ్ళయినా కూడా ఇంకా ఆమెకు అవకాశాలు అప్పుడప్పుడూ తగ్గినా కూడా తిరిగి వెల్లువెత్తుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English