శర్వా ఆ సినిమాను వదిలేశాడా?

శర్వా ఆ సినిమాను వదిలేశాడా?

‘రాధ’తో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ చాలా త్వరగానే పుంజుకుని ‘మహానుభావుడు’తో మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు శర్వానంద్. ఈ సినిమా తర్వాత ఒకటికి రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు శర్వా. అందులో ఒకటి ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మతో అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి కూడా వెళ్లబోతోంది. ప్రి ప్రొడక్షన్ కూడా పూర్తి కావచ్చింది.

దీంతో పాటు శర్వా సమాంతరంగా రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందట.

ఈ సినిమా ఎందుకు ఆగిందన్న విషయంలో స్పష్టత లేదు. బాహుబలి నిర్మాతలు చేయబోయే తర్వాతి సినిమా అంటూ దీనిపై జనాల్లో బాగానే ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో లాంటి డిజాస్టర్లు తీసినప్పటికీ బాహుబలి నిర్మాతలు ప్రకాష్ మీద నమ్మకం పెట్టడం కూడా ఆసక్తి రేకెత్తించింది.

మరి ఏ కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందో తెలియాల్సి ఉంది. ఐతే ప్రకాష్ ట్రాక్ రికార్డు చూసిన జనాలు మాత్రం శర్వా ఈ సినిమా చేయకపోవడమే మంచిదైందని అంటున్నారు. ‘మహానుభావుడు’ సక్సెస్ తర్వాత శర్వాతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు లైన్లో ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి అతడితో తర్వాతి సినిమా చేసే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు