అర్జున్ రెడ్డికి జోడీగా ఆ పిల్లా?

అర్జున్ రెడ్డికి జోడీగా ఆ పిల్లా?

‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ విషయంలో రోజుకో సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ వస్తోంది. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ఈ రీమేక్‌తోనే కథానాయకుడిగా పరిచయం కాబోతున్న ప్రకటించడమే పెద్ద సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఒరిజినల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తాడన్న ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవికమైన కథలో పచ్చిగా సినిమాలు తీసే బాలా.. ఒక రీమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.

పైగా ‘అర్జున్ రెడ్డి’ లాంటి ఒరిజినాలిటీ ఉన్న, ప్రత్యేకంగా అనిపించే సినిమాను బాలా రీమేక్ చేయడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. బాలా సినిమాలు మామూలుగా చాలా ట్రెడిషనల్‌గా, కొంచెం పాత ధోరణిలో ఉంటాయి. మరి ‘అర్జున్ రెడ్డి’ లాంటి మోడర్న్ మూవీని ఆయనెలా డీల్ చేస్తాడో చూడాలి. ఈ విషయంలోనే బాలా ఎంపిక కరెక్టా కాదా అన్న డిస్కషన్లు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి కోలీవుడ్లో.

మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌ కోసం తెరమీదికి వచ్చిన హీరోయిన్ పేరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘జై చిరంజీవ’.. ‘దూకుడు’ లాంటి సినిమాల్లో బాల నటిగా కనిపించి, ఆపై నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’తో హీరోయిన్ అయిన శ్రియా శర్మను కథానాయికగా పరిశీలిస్తున్నారట. ఐతే హీరోయిన్‌గా మారిన తొలి సినిమాలో శ్రియ చాలా ఎబ్బెట్టుగా కనిపించింది. ఆమె షాలిని పాండే చేసిన పాత్రకు సూటవుతుందా.. అంత బోల్డ్‌గా నటిస్తుందా.. మంచి అందగాడిలా కనిపిస్తున్న ధ్రువ్ పక్కన తను సెట్టవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English