19న పవన్ సినిమా టైటిల్ ప్రకటన?

19న పవన్ సినిమా టైటిల్ ప్రకటన?

ఏడెనిమిది నెలలైంది పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఇప్పటిదాకా ఈ చిత్ర టైటిలే ప్రకటించలేదు. ఇప్పటికే రకరకాల టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. ఐతే చివరికి ఈ చిత్రానికి ‘అజ్నాతవాసి’ అనే టైటిలే ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక హాసిని క్రియేషన్స్’ ఇటీవలే ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయడంతో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది.

ఐతే ఈ టైటిల్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు.. టైటిల్ డిజైన్ ఎలా ఉంటుంది అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం పవన్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ను ఈ నెల 19న దీపావళి కానుకగా ప్రకటిస్తారట. ఆ రోజు ఈ సినిమాలో పవన్ కొత్త లుక్ తో కలిపి టైటిల్ లోగో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. విడుదలకు ఇంకో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టైటిల్ ప్రకటనలో ఇంకా ఆలస్యం చేయొద్దని చిత్ర బృందం భావిస్తోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇంకో 40 రోజుల దాకా షూటింగ్ చేయాల్సి ఉందట. ఇంకొన్ని రోజుల్లోనే ఫారిన్ షెడ్యూల్ మొదలవుతుంది. నవంబరు నెలాఖరుకల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజవుతుందా లేదా అన్న సందేహాలకు ఇప్పటికే చిత్ర బృందం తెరదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 జనవరి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు