దసరా సినిమాలన్నీ అక్కడ ఫ్లాపే

దసరా సినిమాలన్నీ అక్కడ ఫ్లాపే

దసరాకి వచ్చిన సినిమాల్లో లోకల్‌గా మహానుభావుడు హిట్‌ అనిపించుకుంది. జై లవకుశ కూడా తొలి రోజు వినిపించిన టాక్‌కి చాలా బాగానే పర్‌ఫార్మ్‌ చేసింది. స్పైడర్‌ అయితే మరీ దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ మూడు సినిమాలు ఓవర్సీస్‌లో ఫ్లాప్‌ అవడం ఆశ్చర్యం. జైలవకుశ, స్పైడర్‌ చిత్రాలకి ఘనమైన ఓపెనింగ్స్‌ వచ్చాయి.

స్పైడర్‌ అయితే మిలియన్‌ డాలర్లకి పైగా ప్రీమియర్స్‌లోనే కలక్ట్‌ అయినా ఆ తర్వాత అంతా కలిపి అర మిలియన్‌ రాలేదు. భారీ రేటుకి రైట్స్‌ తీసుకున్న స్పైడర్‌ ఓవర్సీస్‌ బయ్యర్‌ నిండా మునిగిపోయినట్టే. జై లవకుశ బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుందని ఆశించారు కానీ మొదటి వీకెండ్‌ తర్వాత పూర్తిగా నెమ్మదించడంతో మిలియన్నర మార్కుతోనే సరిపెట్టింది. ఈ చిత్రానికి కూడా మరో అర మిలియన్‌ వసూలైతే తప్ప ఓవర్సీస్‌ బయ్యర్‌ సేఫ్‌ అవడట. మహానుభావుడుకి మంచి రివ్యూలు వచ్చినా కానీ రెండు పెద్ద సినిమాల తర్వాత వెంటనే రావడం బాగా ఎఫెక్ట్‌ చేసింది.

వరుసగా రెండు సినిమాలు చూసేసిన వారు దీనిని లైట్‌ తీసుకున్నారు. దీంతో మహానుభావుడు కొన్న వారికి కూడా నష్టాలు తప్పేట్టు లేవు. దసరా సినిమాల వరకు అత్యధిక రేట్లు చెల్లించి కొన్న బయ్యర్లకి చేదు జ్ఞాపకాలని మిగిల్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు