ప్రభాస్‌కి ఇంకా చేతకాట్లేదు

ప్రభాస్‌కి ఇంకా చేతకాట్లేదు

బాహుబలి లాంటి విజయం కానీ ఇండస్ట్రీలో మరే పెద్ద హీరోకి పడి వున్నా ఓ రేంజ్‌లో తమ స్థాయిని ఎలివేట్‌ చేసుకునేవారు. మంచి ఫాన్‌ బేస్‌ వున్నా కానీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కుటుంబాల వారికి వున్న మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ప్రభాస్‌కి లేవు. స్టార్‌గా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా కానీ ఇంకా ప్రభాస్‌ ఫాన్‌ గ్రూప్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా వీక్‌.

అభిమానులతో ఇంటరాక్ట్‌ అవడం, మీడియాతో తరచుగా టచ్‌లో వుండడం ప్రభాస్‌ చేయడు. తన సినిమాలు, తన ధోరణి అన్నట్టుంటాడు. దీని వల్లే అసలు ఇంకా ఇండస్ట్రీలో నంబర్‌ వన్‌ హీరో ఎవరనే చర్చ జరుగుతోంది. ఇదే రేంజ్‌ విజయం మెగా లేదా నందమూరి క్యాంప్‌లో పడ్డట్టయితే వారు తమని తాము నంబర్‌వన్‌గా ప్రకటించేసుకోవడమే కాకుండా, అందరితో ఆ మాట అనిపించేద్దురు.

ప్రభాస్‌కి అలాంటి తెలివితేటలు లేకపోయే సరికి ఇంకా అతడిని ఫస్ట్‌ ప్లేస్‌ కంటెండర్‌గా కూడా కొందరు లెక్కించడం లేదు. ఎంతటి విజయాలున్నా కానీ ఇక్కడ సెల్ఫ్‌ ఎలివేషన్‌ కూడా చాలా అవసరమని ప్రభాస్‌ ఎప్పటికి గుర్తించి ఆ దిశగా అడుగులేస్తాడా అని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు