పెళ్లి త‌ర్వాత చై-శామ్ ల ఫ‌స్ట్‌ పిక్ వైర‌ల్!

పెళ్లి త‌ర్వాత చై-శామ్ ల ఫ‌స్ట్‌ పిక్ వైర‌ల్!

రెండు రోజుల క్రితం నాగచైతన్య, సమంతల‌ వివాహం హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల్లో కుటుంబ స‌భ్యులు, అతికొద్ది మంది స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ఆ పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సంద‌ర్భంగా చైతూ ష‌ర్ట్ ను నాగార్జున లాగేస్తున్న ఫొటో....నాగ్‌, వెంకీ, చైతూలు డీజేలో డ్యాన్స్ చేసిన ఫొటో....సురేష్ బాబు, స‌మంత‌లు క‌లిసి చిందులేసిన ఫొటో...ఇవ‌న్నీ అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

అయితే, పెళ్లయిన త‌రువాత వారి ఫొటోలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా, ఈ జంట దిగిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. న‌వ దంప‌తులిద్ద‌రూ ప్రత్యూష స‌పోర్ట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్ డాక్ట‌ర్‌ మంజులతో ఫొటో దిగారు. కొత్త పెళ్లి కూతురు సమంత ఎరుపు రంగు డ్రెస్ లో చిరున‌వ్వులు చిందిస్తోంది. కొత్త‌ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి ఫొటో కావ‌డంతో ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్లో ఈ ఫొటోనే ట్రెండింగ్ లో ఉంది. చైతూ, శామ్ లు హ‌నీమూన్ త‌ర్వాత షూటింగ్‌లో పాల్గొంటారు. హ‌నీమూన్ అనంత‌రం స‌మంత రంగ‌స్థ‌లం 1985 చిత్ర షూటింగ్ లో, చైతూ స‌వ్య‌సాచి షూటింగ్ లో పాల్గొంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు