రజనీకాంత్‌ సంచలనాలకి అంతే లేదు

రజనీకాంత్‌ సంచలనాలకి అంతే లేదు

రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న రోబో సీక్వెల్‌ ఖర్చు నాలుగొందల కోట్లు దాటిపోయిందని అంచనా. రెండు వందల కోట్ల బడ్జెట్‌లో తీద్దామని అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు డబుల్‌ అయిపోయినా నిర్మాతలు ఏమాత్రం భయపడడం లేదు. ఈ చిత్రానికి వస్తోన్న బిజినెస్‌ ఆఫర్లు చూస్తే విడుదలకి ముందే కనీసం ఆరు వందల కోట్లు చేతిలోకి వచ్చేలాగుంది. కేవలం శాటిలైట్‌, డిజిటల్‌ హక్కుల ద్వారానే 170 కోట్లు వస్తున్నాయంటే దీనిపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుస్తోంది.

తెలుగు వెర్షన్‌ రైట్స్‌ ఎనభై కోట్లు చెల్లించి ఎన్‌ఆర్‌ఏ పద్ధతిలో తీసుకున్నారు. ఒక అనువాద చిత్రానికి ఈ రేటు ఇచ్చారంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ వుండడం వల్ల బిజినెస్‌కి ఎలాంటి లోటు వుండదు. బాహుబలి వల్ల దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది వాళ్లకి చిన్నచూపు పోయింది. మన సినిమాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారిపుడు.

రజనీకాంత్‌, శంకర్‌ ఇద్దరూ నేషనల్‌ లెవల్‌ బ్రాండ్స్‌ కనుక,వారికి అక్షయ్‌కుమార్‌ తోడయి, అన్నిటికీ మించి ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఎప్పుడూ చూడని లెవల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వుంటాయనే సరికి '2.0' రైట్స్‌ తీసుకోవడం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. విడుదల సమయానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా అత్యధిక రేటు పలికిన సినిమాగా ఇది రికార్డులకి ఎక్కుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు