మారుతి, శర్వాల విజయ రహస్యంపై దిల్ రాజు

మారుతి, శర్వాల విజయ రహస్యంపై దిల్ రాజు

హీరో శర్వానంద్ చివరగా చేసిన ఆరు సినిమాల్లో ఐదు హిట్టయ్యాయి. దర్శకుడు మారుతి కెరీర్ మొత్తంలో చేసిన ఏడు సినిమాల్లో ఐదు సూపర్ హిట్టయ్యాయి. వీళ్లిద్దరూ ఇంత నిలకడగా సక్సెస్ సాధిస్తుండటానికి కారణమేంటో నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ‘మహానుభావుడు’ సక్సెస్ మీట్లో రాజు దీని గురించి మాట్లాడాడు.

శర్వానంద్‌ను తాను కెరీర్ ఆరంభం నుంచి చూస్తున్నానని.. అతణ్ని హీరో చేయడం కోసం కార్లో తీసుకెళ్లింది తానేనని రాజు చెప్పాడు. శర్వా ఎంతో డెడికేషన్ ఉన్న హీరో అని.. ఒక సినిమా మొదలైతే అందులో అతను ఇన్వాల్వ్ అయ్యే తీరు అమోఘమని రాజు అన్నాడు. సినిమా కోసం ఏం చెయ్యాలో అదంతా అతను చేస్తాడని.. సినిమాపై అతడికి అంత ప్రేమ అని అన్నాడు రాజు. అతను కథలు ఎంచుకుంటున్న తీరు.. నటిస్తున్న తీరు తనకెంతో ఆనందాన్నిస్తోందని రాజు అన్నాడు.

ఇక మారుతి గురించి చెబుతూ.. అతను పెద్ద పెద్ద కథలేమీ ఎంచుకోడన్నాడు. తన కథలు సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాడని.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలన చూస్తాడని రాజు అభిప్రాయపడ్డాడు. హీరో క్యారెక్టరైజేషన్ మీదే కథల్ని సరదాగా నడిపించడం మారుతి శైలి అని.. ‘మహానుభావుడు’ విషయంలోనూ అలాగే చేశాడని అన్నాడు. ఈ సినిమాలో వేణు పాత్రతో ముడిపడ్డ సీన్లయినా.. సెకండాఫ్‌లో వచ్చే నది సన్నివేశం అయినా భలేగా పేలాయని.. ఇలాంటివి మన నిజ జీవితంలోనూ చూస్తుంటామని.. అలా జనాలకు కనెక్టయ్యే సీన్లు తీయడం వల్లే మారుతి విజయవంమవుతున్నాడని రాజు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు