అల్లు చెప్పబోయే సీక్రెట్ ఏంటి?

అల్లు చెప్పబోయే సీక్రెట్ ఏంటి?

‘గీతా ఆర్ట్స్’ బేనర్ మీద భారీ సినిమాలు తీస్తుంటారు అల్లు అరవింద్. ఐతే కొంచెం తక్కువ స్థాయిలో.. మీడియం రేంజిలో సినిమాలు చేసేందుకు ఆయన ‘జీఏ-2’ అంటూ ఇంకో బేనర్ కూడా పెట్టారు. అది చాలదన్నట్లు బన్నీ వాసు.. జ్నానవేల్ రాజా.. ‘యువి క్రియేషన్స్’ వంశీలతో కలిసి అరవింద్ ‘వీ4 క్రియేషన్స్’ పేరుతో ఇంకో బేనర్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

కొత్త టాలెంట్ ఎక్కడున్నా తమ దగ్గరికి రావొచ్చని.. డిఫరెంట్స్ కాన్సెప్టులతో.. సరైన ప్లానింగ్ తో తమ దగ్గరికి వస్తే అవకాశాలిస్తామని.. సినిమాలు చేస్తామని అరవింద్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బేనర్లో తొలిసారి నిర్మించిన ‘నెక్స్ట్ నువ్వే’ ఆడియో వేడుకలో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు అరవింద్.

ఐతే అవకాశాలివ్వడం సరే.. తనలాంటి బిజిగా ఉండే పెద్ద నిర్మాతను అసలు కలవడం ఎలా అని అందరికీ ఓ సందేహం ఉందని.. ఆ విషయంలో ఆందోళన అక్కర్లేదని.. ఈ దిశగా అందరికీ ఒక మార్గం చూపించబోతున్నామని అరవింద్ చెప్పారు.

మంచి కథలతో ఎవరైనా తనను కలిసేందుకు తమ దగ్గర ఒక ప్లాన్ ఉందని.. ‘నెక్స్ట్ నువ్వే’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కానీ.. విడుదల సమయంలో కానీ ఈ విషయాన్ని వెల్లడిస్తానని.. అప్పటిదాకా ఎదురు చూడాలని అరవింద్ చెప్పారు. ‘వీ4 క్రియేషన్స్’ బేనర్లో రాబోయే తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’ కచ్చితంగా విజయవంతమవుతుందని.. తమ బేనర్ కు శుభారంభాన్నివ్వాల్సిన బాధ్యత దర్శకుడు ప్రభాకర్ మీద ఉందని.. అతడి చేయి మంచిదవుతుందని ఆశిస్తున్నామని అరవింద్ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు