మా చెట్టుకు డబ్బులు కాయట్లేదు-మంచు లక్ష్మి

మా చెట్టుకు డబ్బులు కాయట్లేదు-మంచు లక్ష్మి

మంచు లక్ష్మీ ప్రసన్న ఇంతకుముందు ఆమె జెమిని టీవీల ‘మేము సైతం’ పేరుతో ఒక ఛారిటీ షో చేసిన సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న కుటుంబాల్ని తీసుకొచ్చి వాళ్ల దీన గాథల్ని ప్రేక్షకులకు వినిపించడం.. వాళ్ల కోసం ఓ సెలబ్రెటీ బయట ఈవెంట్ నిర్వహించి విరాళాల సేకరణ ద్వారా వచ్చిన మొత్తాన్ని అందజేయడం చేసేవాళ్లు.

ఐతే ఈ షో ముగిశాక కూడా మంచు లక్ష్మి వద్దకు చాలామంది జనాలు వరుస కట్టేస్తున్నారట. తమను ఆదుకోవాలంటూ ఇంటికొచ్చి మరీ ఆమెను ఒత్తిడి చేస్తున్నారట. వీళ్లకు ఏం చెప్పాలో తనకు తెలియట్లేదని అంటోంది లక్ష్మి.

‘‘మా ఇంట్లో మామిడి చెట్టుకు మామిడి కాయలే కాస్తున్నాయి. డబ్బులు కాయట్లేదు. నాకు అంత డబ్బు ఉంటే నేను సాయం చేసేదాన్ని. నేను అందరికీ హెల్ప్ చేయలేను. కొందరికి కొంతమేర సాయం చేస్తున్నా. ఐతే ఇలాంటి ఇంటికి వచ్చే వాళ్లను వీళ్లను నా ఆఫీసుకు వెళ్లమంటున్నా. నా టీం వాళ్లకు తోచిన మేర.. ఏదో విధంగా హెల్ప్ చేస్తోంది’’ అని మంచు లక్ష్మి తెలిపింది. ఐతే ‘మేము సైతం’ షో చేశాక తనకు జనాల్లో చాలా మంచి పేరొచ్చిందని లక్ష్మి అంది.

ఈ మధ్య ఒకసారి తిరుమలకు వెళ్తే.. అక్కడ ఒకరు తన దగ్గరికొచ్చి.. ‘‘అక్కడ దేవుణ్ని చూస్తున్నాం. ఇక్కడ దేవతను చూస్తున్నాం’’ అన్నారని.. తనకు అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుందని లక్ష్మి చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English