ఈ హిట్టుతో ఏమైనా యూజ్‌ వుందా?

ఈ హిట్టుతో ఏమైనా యూజ్‌ వుందా?

హీరోయిన్‌ ప్రధానంగా తీసిన సినిమా బ్లాక్‌బస్టర్‌ అవడం వల్ల సదరు హీరోకి ఏమైనా హెల్ప్‌ వుంటుందా? 'అఆ' చిత్రం అంతటి హిట్‌ అవడంతో తన మార్కెట్‌ బాగా పెరిగిందని నితిన్‌ భావించాడు. అదే నమ్మకంతో అతని సినిమాపై నిర్మాతలు మామూలుగా కంటే ఎక్కువ ఖర్చు పెట్టి 'లై' తీసారు. ఆ చిత్రానికి డిపాజిట్లు కూడా దక్కలేదు. 'అఆ' ప్రభావం 'లై'పై అసలు కనిపించకపోవడం విస్మరపరచింది.

నితిన్‌కి సాలిడ్‌ మార్కెట్‌ వుందనే నమ్మకం కలిగించిన వెంటనే ఇలా జరగడంతో ఇప్పుడు వరుణ్‌ తేజ్‌పై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. 'ఫిదా' అంత పెద్ద హిట్‌ అయినా కానీ అది ప్రధానంగా హీరోయిన్‌ సాయి పల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఖాతాలోకి పోయింది. ఫిదాతో వరుణ్‌ తేజ్‌కి గుర్తింపు అయితే వచ్చింది కానీ స్టార్‌డమ్‌ వచ్చిందని అనుకోవడానికి లేదు.

అతని తదుపరి చిత్రం చాలా కీలకమవుతుంది. ఈసారి కూడా అతను విజయం సాధిస్తే కనుక ఫిదా హిట్టు అతనికి దోహదపడుతుంది. నెక్స్‌ట్‌ది మిస్‌ఫైర్‌ అయితే మాత్రం ప్రస్తుతం నితిన్‌ ఎదుర్కొంటోన్న పరిస్థితే వచ్చే అవకాశముంది. అసలే ఫిదాకి ముందు చేసిన మిస్టర్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా ఫ్లాప్‌ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు