చైతన్యకి ఏ లోపం లేదు

చైతన్యకి ఏ లోపం లేదు

మారుతితో సినిమా అంటే హీరోకి ఏదో ఒక డిజార్డర్‌ వుంటుందనే ఫీలింగ్‌ వచ్చేసింది. మతిమరపు, జాలి, అతి శుభ్రం అంటూ హీరోలని తనదైన శైలిలో వినోదాత్మకంగా చూపిస్తోన్న మారుతి సినిమా కథలంటే ఇలాగే వుంటాయనే ముద్ర పడిపోయింది. మహానుభావుడు చిత్రం బాగా ఆడుతున్నా కానీ 'భలే భలే మగాడివోయ్‌'లానే వుందనేది పలువురి అభిప్రాయం. ఈ విమర్శ మారుతి వరకు వెళ్లింది. అందుకే తన పంథా మార్చుకోవాలని డిసైడయ్యాడు.

తన తదుపరి చిత్రంలో హీరోకి ఏ లోపం వుండదని, నాగచైతన్య హీరోగా తీసే సినిమా పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమని, ప్రేమకథని వినోదాత్మకంగా, అందరినీ అలరించేలా చెప్పాలని అనుకుంటున్నానని, ఇప్పటికే ఈ సినిమాకి స్టోరీ లైన్‌ డిసైడ్‌ అయిందని మారుతి చెప్పాడు. ఇండస్ట్రీలో వున్న అగ్రహీరోలు అందరితో పని చేసి 'మారుతి సినిమా' అని అందరూ గుర్తించేలా పేరు తెచ్చుకోవాలని వుందని చెప్పాడు. రేపు బర్త్‌డే జరుపుకుంటోన్న మారుతి ఈ ఏడాది బర్త్‌డేని 'మహానుభావుడు' బృందంతో మరింత హ్యాపీగా జరుపుకోబోతున్నాడు. అనతికాలంలోనే మినిమమ్‌ గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతికి జన్మదిన శుభాకాంక్షలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English