శ్రుతి రేంజ్ అంతలా పడిపోయిందా

శ్రుతి రేంజ్ అంతలా పడిపోయిందా

చూస్తుండగానే శ్రుతి హాసన్ టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. ‘కాటమరాయుడు’ ఫ్లాప్ కావడం, పైగా ఆ సినిమాలో శ్రుతి లుక్ తేడా కొట్టేయడంతో ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. రకుల్ ప్రీత్, పూజా హెగ్డే, మెహ్రీన్ కౌర్, రాశి ఖన్నా లాంటి కొత్త అందగత్తెల ముందు ఇప్పుడు శ్రుతి నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం శ్రుతిని కథానాయికగా ఎవరూ కన్సిడర్ చేస్తున్నట్లు కూడా లేదు.

ఒకసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించాక చాలా ఏళ్ల పాటు హవా నడిపించే అవకాశముంటుంది. కానీ శ్రుతి కెరీర్ స్పాన్ మాత్రం బాగా తక్కువ అయిపోయింది. స్టార్ స్టేటస్ సంపాదించిన నాలుగైదేళ్లకే అమ్మడి కెరీర్ ముగింపు దశకు వచ్చేసింది.

తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో, హిందీలో శ్రుతికి అవకాశాలు లేవిప్పుడు. అలాగని శ్రుతినే ఛాన్సులు వదులుకుంటోందా అంటే అలా కూడా కనిపించడం లేదు. ఆమె లేటెస్టుగా కన్నడలో ఓ సినిమా ఒప్పుకుంది. ఆమె కన్నడలో నటించబోయేది పెద్ద హీరో సరసన కూడా కాదు. ధ్రువ సర్జా అనే మీడియం రేంజి హీరో సరసన. గతంలో కన్నడలో కొందరు పెద్ద స్టార్ల పక్కన నటించే ఛాన్స్ వచ్చినా శ్రుతి తిరస్కరంచినట్లు వార్తలొచ్చాయి.

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా పరిచయమైన ‘జాగ్వార్’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగినా నో చెప్పిందామె. అసలు సౌత్ స్టార్ హీరోయిన్లు కన్నడ ఇండస్ట్రీని కొంచెం తక్కువగానే చూస్తారు. తెలుగులో.. తమిళంలో ఏ ఇబ్బందీ లేకుండా సినిమాలు చేస్తారు కానీ.. కన్నడ సినిమా అంటే లైట్ తీసుకుంటారు. అక్కడ పారితోషకాలు కూడా తక్కువ. మరి అలాంటి చోట శ్రుతి ఓ మీడియం రేంజి హీరోతో సినిమా చేయబోతోందంటే ఆమె స్థాయి ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు