డైరెక్టర్ చేసిందాంట్లో సగం చాలట

డైరెక్టర్ చేసిందాంట్లో సగం చాలట

యువ దర్శకుడు అనిల్ రావిపూడిని ఆకాశానికెత్తేశాడు మాస్ రాజా రవితేజ. ‘రాజా ది గ్రేట్’ సినిమా విషయంలో తన పాత్ర ఎలా చేయాలనే విషయంలో తనకు అనిల్ చాలా హింట్స్ ఇచ్చాడని.. చేసి చూపించాడని.. అతను చేసిందాంట్లో తాను 50 శాతం చేసి ఉన్నా కూడా చాలా మంచి పేరు వస్తుందని రవితేజ వ్యాఖ్యానించడం విశేషం.

ఒక్క మాటలో చెప్పాలంటే ‘రాజా ది గ్రేట్’ విషయంలో అనిల్ ఇరగ్గొట్టేశాడని.. అతను తనకు తెలిసిన వాళ్లలో మోస్ట్ పాజిటివ్ పర్సన్ అని.. విపరీతమైన క్లారిటీ ఉన్న దర్శకుడతడని.. షూటింగ్ జరుగుతున్నంత కాలం ఏ ఒక్క ఆర్టిస్టుకు కూడా చిరాకు రానివ్వకుండా చూసుకున్నాడని.. అతడి ఎనర్జీ అద్భుతమైని అన్నాడు రవితేజ.

‘భద్ర’ సినిమా చేసిన 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ దిల్ రాజుతో తాను సినిమా చేస్తున్నానని.. ఐతే ఇంత గ్యాప్ వచ్చినప్పటికీ ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని రవితేజ అన్నాడు. ‘రాజా ది గ్రేట్’ సినిమా ద్వారా తొలిసారి రాజేంద్ర ప్రసాద్.. రాధిక గార్లతో పని చేసే అవకాశం లభించిందని.. ఇది తనకు మంచి అనుభవమని అన్నాడు మాస్ రాజా.

హీరోయిన్ మెహ్రీన్ కు గొప్ప భవిష్యత్తు ఉందని.. ఆమె ‘రాజా ది గ్రేట్’తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని.. ఇప్పటికే జెండా రెడీ అయిందని.. ఆమె త్వరలోనే ఇక్కడ జెండా పాతేస్తుందని రవితేజ చెప్పాడు. మెహ్రీన్ ఇప్పటికే తెలుగు మాట్లాడుతోందని.. త్వరలోనే పూర్తిగా తెలుగులోనే మాట్లాడేస్తుందని అన్నాడు. దిల్ రాజు అన్నట్లుగా దీపావళికి ‘రాజా ది గ్రేట్’ సూపర్ హిట్టయి.. ఈ పండగ కూడా సంక్రాంతి.. దసరాల్లాగా సక్సెస్ ఫుల్ సీజన్ అవుతుందని రవితేజ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు