ప్రపంచంలోనే ఇలాంటి సినిమా రాలేదట

ప్రపంచంలోనే ఇలాంటి సినిమా రాలేదట

రవితేజ కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’ టీజర్ చూసినా.. ట్రైలర్ చూసినా.. రవితేజ అంధుడిగా నటించడం తప్పితే అందులో ఏమంత కొత్తదనం కనిపించలేదు. ఐతే అనిల్ రావిపూడి తనదైన స్టయిల్లో కమర్షియల్ హంగులకు లోటు లేకుండా చూసుకున్నట్లున్నాడు. సినిమాలో ఎంటర్టైన్మెంట్‌కు అయితే ఢోకా లేదనిపించింది. ఐతే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాత్రం ‘రాజా ది గ్రేట్’ ఒక కళాఖండం అన్నట్లే మాట్లాడాడు. ప్రపంచంలో ఇలాంటి సినిమానే రాలేదని అనుకుంటున్నట్లుగా ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు రాజేంద్రుడు. ఇందుకు ఆయన చెప్పిన కారణం ఏంటంటే..

హీరో అంధుడిగా నటించిన సినిమాలు గతంలో చాలా వచ్చాయని.. కానీ ఇలాంటి ఓ పెద్ద స్థాయి కమర్షియల్ సినిమా మాత్రం రాలేదని అన్నాడు రాజేంద్ర ప్రసాద్. 40 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఎన్నో సినిమాలు చూశానని.. కానీ తన కెరీర్లో ఇలా హీరోను అంధుడిగా పెట్టి ఇంత పెద్ద స్థాయిలో ఎవరూ కమర్షియల్ సినిమా చేయలేదని రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. తనకు తెలిసి తెలుగులోనే కాదు.. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలాంటి ఒక సినిమా రాలేదని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు.

డార్జిలింగ్‌లో ఇప్పటిదాకా చాలామంది సినిమాలు తీశారని.. కానీ ఆ ప్రాంతాన్ని ‘రాజా ది గ్రేట్’లో చూపించినట్లుగా కూడా ఎవరూ చూపించి ఉండరని.. తాము అక్కడ ఉన్నంత కాలం చాలా ప్రశాంతంగా ఉందని.. తాము వచ్చేశాక అక్కడ అందరూ కొట్టుకుచస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. దిల్ రాజు మామూలు నిర్మాత కాదని.. డి.రామానాయుడు తర్వాత ఆ స్థాయి ఉన్న ప్రొడ్యూసర్ అని.. అతను డైరెక్టర్ల తాట తీస్తాడని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు