మ‌గ‌ధీర‌, బాహుబ‌లి త‌ర్వాత 'ఫిదా'నే!

మ‌గ‌ధీర‌, బాహుబ‌లి త‌ర్వాత 'ఫిదా'నే!

శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వ‌చ్చిన “ఫిదా” సినిమా సైలెంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు సినీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఓవ‌ర్సీస్ లో కూడా ఫిదా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది.  త‌న అందం, అభిన‌యంతో  మ‌ల‌యాళ భామ సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. తెలంగాణ యాస‌లో సాయి ప‌ల్ల‌వి డైలాగ్స్ తెలుగు ప్రేక్ష‌కులకు చిర‌కాలం గుర్తుండిపోతాయి. బాన్సువాడ భానుమ‌తికి వెండితెర ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ హైబ్రిడ్ పిల్ల కు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. స్టార్ మా లో ప్ర‌సార‌మైన ఫిదా సినిమా 21.30 టీఆర్పీ సాధించి ఇటీవ‌లి కాలంలో అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. టెలివిజ‌న్ చరిత్ర‌లో అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన టాప్ 10 చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది.

సెప్టెంబ‌రు 24వ తేదీ మ‌ధ్యాహ్నం స్టార్ మా చానెల్ లో ఫిదా సినిమా ప్ర‌సార‌మైంది. సాధారణంగా బుల్లితెరపై సాయంత్రం వేళల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలకు రేటింగ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. కానీ, మ‌ధ్యాహ్నం ప్ర‌సార‌మైన ఫిదా 21.30 టీఆర్పీ పాయింట్స్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. శ్రీమంతుడు (21.24), సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు (20), అత్తారింటికి దారేది (19.04) చిత్రాల‌ను వెన‌క్కు నెట్టి మూడో స్థానాన్ని ఆక్ర‌మించుకుంది. మొద‌టి రెండు స్థానాల్లో మ‌గ‌ధీర (22), బాహుబ‌లి (21.84) సినిమాలు ఉన్నాయి. కేవ‌లం సాయిపల్లవి నటనతోనే ఫిదా..... స్టార్ హీరోల సినిమాల టీఆర్పీల‌ను అధిగ‌మించ‌డం మామూలు విషయం కాదు. ఫిదాకు వ‌చ్చిన టీఆర్పీ రేటింగ్స్ టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేశాయ‌ని టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు