స్పైడర్ బ్రేక్ ఈవెన్.. ఎంతెంత దూరం

స్పైడర్ బ్రేక్ ఈవెన్.. ఎంతెంత దూరం

‘స్పైడర్’ జస్ట్ డిజాస్టర్ కాదని.. దీన్ని డబుల్ డిజాస్టర్ అనాల్సిందే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.16 కోట్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం మిగతా ఆరు రోజుల్లో కలిపి సాధించిన వసూళ్లు కూడా అంతే కావడం గమనార్హం. తొలి వారం ముగిసేసరికి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.32 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. పది పది రోజులు పూర్తయ్యేసరికి షేర్ రూ.34 కోట్లకు అటు ఇటుగా ఉందంతే.

దసరా సెలవుల్లో, వీకెండ్స్ కూడా ఉండి ఇలాంటి వసూళ్లు రావడమంటే దారుణమే. ఇక ఈ సినిమా పుంజుకుంటుందన్న ఆశలు ఏ కోశానా లేవు. తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్ల కంటే కొంచెం ఎక్కువే బిజినెస్ చేసింది ‘స్పైడర్’. ఫుల్ రన్లో అందులో సగం మాత్రమే వసూలయ్యేలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘బ్రహ్మోత్సవం’ కన్నా పెద్ద డిజాస్టరే. ఎందుకంటే దాని కంటే కూడా ఈ సినిమాకు ఎక్కువ బిజినెస్ జరిగింది.

అమెరికాలో కనీసం 50 శాతం కూడా రికవర్ కావడం కష్టంగానే ఉంది. ప్రిమియర్లతోనే మిలియన్ మార్కును దాటిన ఈ చిత్రం ఇంకో అర మిలియన్ రాబట్టడానికి ఇంకో వారం పట్టింది. రూ.15.5 కోట్లు పెట్టి హక్కులు కొన్న బయ్యర్ దారుణంగా నష్టపోయేలా ఉన్నాడు. 3 మిలియన్ మార్కును దాటితే తప్ప బ్రేక్ ఈవెన్‌కు రాలేని ‘స్పైడర్’కు 2 మిలియన్ మార్కుకు కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు