నాగార్జునకి అంత సీనుందా?

నాగార్జునకి అంత సీనుందా?

అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం ద్వారా వసూళ్లు త్వరగా రాబట్టుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు కానీ అందుకు తగ్గ క్రేజ్‌ సినిమా విడుదలకి ముందే వచ్చి తీరాలి. లేదంటే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం వల్ల థియేటర్ల రెంటు నష్టం తప్ప ఇంకోటి ఉండదు. ఈమధ్య కాలంలో నాగార్జునకి చెప్పుకోతగ్గ విజయాలేమీ రాలేదు. ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం యావరేజ్‌ అవుతున్నాయి. ఆయన తాజా చిత్రం 'గ్రీకువీరుడు'కి కూడా ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ ఏమీ లేదు.

 అయితే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ట్రెండుని ఫాలో అయిపోతూ వీలయినన్ని థియేటర్లు ఆక్యుపై చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిదనేది సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలీదు. 'గ్రీకువీరుడు' సినిమాపై ప్రేక్షకులకి పెద్దగా అంచనాలేమీ లేవు. నాగార్జున అభిమానులు మినహా  దీని కోసం ఎవరూ ఆత్రుతగా ఎదురు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఇంతటి భారీ రిలీజ్‌ని జస్టిఫై చేయాలంటే 'గ్రీకువీరుడు' తొలి రోజే బ్రహ్మాండమైన టాక్‌ తెచ్చుకోవాలి. అప్పుడే థియేటర్లన్నీ కళకళలాడతాయి. మాస్‌ తర్వాత నాగార్జునకి ఇంతవరకు యునానిమస్‌ హిట్‌ లేదు. ఆ లోటుని గ్రీకువీరుడు తీరుస్తాడో లేదో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు