మెహ్రీన్ మొదలెట్టేసిందిగా..

మెహ్రీన్ మొదలెట్టేసిందిగా..

తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో మెరిసి మాయమైన మెహ్రీన్ కౌర్.. ఎట్టకేలకు ఇటీవలే ‘మహానుభావుడు’లో పలకరించింది. కొంచెం లుక్ మార్చుకుని.. మరింత సెక్సీగా తయారై వచ్చిన మెహ్రీన్‌కు ‘మహానుభావుడు’లో మంచి క్యారెక్టరే దక్కింది. హీరోతో సమానంగా సినిమా అంతటా స్క్రీన్ టైం ఉన్న క్యారెక్టర్ ఆమెది. ఈ పాత్రలో చాలా అందంగా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెలకు కోత పెట్టేసింది మెహ్రీన్.

పాజిటివ్ బజ్ మధ్య విడుదలైన ‘మహానుభావుడు’ అంచనాల్ని మించి విజయం సాధిస్తోంది. మెహ్రీన్‌కు సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యేలాగే కనిపిస్తోంది. ఈ సినిమాతో తెలుగు కుర్రాళ్ల కొత్త కలల రాణిగా మారిపోయిందామె.

తొలి సినిమా తర్వాత ఏడాదిన్నర పైగా విరామం వచ్చినప్పటికీ.. ఈ గ్యాప్ మొత్తాన్ని కవర్ చేసేలా రెండు నెలల వ్యవధిలో నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తోంది మెహ్రీన్. ‘మహానుభావుడు’ వచ్చిన మూడు వారాలకే రవితేజ మూవీ ‘రాజా ది గ్రేట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మెహ్రీన్.

ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాల్లో క్లాస్‌గా కనిపించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ‘రాజా ది గ్రేట్’లో కొంచెం మాస్ లుక్‌తో కనిపిస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయిందంటే.. మెహ్రీన్‌కు స్టార్ స్టేటస్ వచ్చేసినట్లే. ఇక ‘కేరాఫ్ సూర్య’.. ‘జవాన్’ సినిమాల్లో ఒకటి ఆడినా మెహ్రీన్‌కు తిరుగుండదు. మొత్తానికి ‘మహానుభావుడు’ సినిమాతో తన టైం మొదలైందని చాటిన మెహ్రీన్.. తర్వాతి మూడు సినిమాలతో ఎలాంటి ఫలితాలనందుకుంటుందో చూద్దాం

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు