డిజాస్టర్ కాంబో.. మళ్లీ?

డిజాస్టర్ కాంబో.. మళ్లీ?

మహేష్ బాబు-రకుల్ ప్రీత్ కాంబినేషన్ గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. రామ్ చరణ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో వరుసగా నటించేసిన రకుల్.. మహేష్ బాబుతో జోడీ కట్టాలని ఎప్పట్నుంచో ఆశపడుతోంది. నిజానికి ‘బ్రహ్మోత్సవం’ కోసం ముందుగా అనుకున్న కథానాయిక రకుల్ ప్రీతే.

కానీ డేట్లు సర్దుబాటు చేయలేక  ఆ సినిమా ఓకే కాలేదు. పోనీలో ఒక డిజాస్టర్ తప్పిందని సంతోషించింది రకుల్. ఐతే మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడితో మహేష్ కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం దక్కిందని సంబరపడ్డ రకుల్‌కు చేదు అనుభవమే మిగిలింది. ‘స్పైడర్’ డిజాస్టర్ అయి.. ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లింది.

ఐతే ‘స్పైడర్’ ఫలితం గురించి పట్టించుకోకుండా రకుల్‌తో ఇంకో సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’లో నటిస్తున్న మహేష్.. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు హీరోయిన్‌కు పూజా హెగ్డేతో పాటు పలు పేర్లు పరిశీలించిన అనంతరం.. చివరికి రకుల్ ప్రీత్‌కే ఓటేశారట. ‘స్పైడర్’ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులో రకుల్ టాలెంట్ చూసి.. తనకు మరో అవకాశం ఇవ్వడానికి మహేష్ అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు-అశ్వినీదత్ ఉమ్మడిగా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు