డ్యామేజ్‌ కంట్రోల్‌లో మహేష్‌ టీమ్‌ బిజీ

డ్యామేజ్‌ కంట్రోల్‌లో మహేష్‌ టీమ్‌ బిజీ

మహేష్‌బాబు మరోసారి డిప్రెషన్‌లోకి వెళ్లాడనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. బ్రహ్మూెత్సవం పరాజయం తర్వాత కొంతకాలం బయటకి రాని మహేష్‌, ఇప్పుడు స్పైడర్‌ విషయంలోను అలాగే హర్ట్‌ అయ్యాడని గాసిప్స్‌. తన సినిమాలు ఫ్లాప్‌ అయినపుడు తట్టుకోలేనని మహేష్‌ కూడా పలుమార్లు చెప్పాడు.

దానిని బట్టి అతను ఇప్పుడు నిజంగానే ఈ పరాజయంతో ఎఫెక్ట్‌ అయ్యాడని అనుకోవచ్చు. స్పైడర్‌ ఫ్లాప్‌తో మహేష్‌పై మీడియాలో చాలా నెగెటివ్‌ వార్తలు వస్తున్నాయి. హిట్‌ టాక్‌ వస్తే తప్ప సినిమాలని అసలు పుల్‌ చేయలేకపోవడాన్ని అందరూ వేలెత్తి చూపిస్తున్నారు.

ఈ సినిమాకి వంద కోట్లకి పైగా గ్రాస్‌ వచ్చిందంటూ పోస్టర్లు విడుదల చేసినా కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మహేష్‌పై నెగెటివ్‌ వార్తలు రాకుండా ఒక టీమ్‌ కృషి చేస్తోందట. మహేష్‌పై ఎలాంటి బ్యాడ్‌ రిపోర్ట్‌ వచ్చినా కానీ అది తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటోందట. మహేష్‌ సున్నిత స్వభావం గురించి బాగా తెలిసిన నమ్రత తన టీమ్‌కి చెప్పి ఈ కేర్‌ తీసుకుంటున్నట్టు గుసగుసలున్నాయి.

పొరపాటున ఏదైనా నెగెటివ్‌ న్యూస్‌ మహేష్‌ కంట పడితే అతను మరింత డిప్రెస్‌ అవ్వవచ్చునని ఈ కేర్‌ తీసుకుంటున్నారని, మహేష్‌ తదుపరి చిత్రం విషయంలో కూడా మరింత శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ వదంతుల్లో నిజం ఎంత వుందనేది తెలియదు కానీ మహేష్‌ దీనినుంచి త్వరగా కోలుకుని తన తదుపరి చిత్రం అప్‌డేట్స్‌తో ఫాన్స్‌ని ఖుషీ చేస్తే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు