టాప్‌ లేపుతోన్న మహానుభావుడు

టాప్‌ లేపుతోన్న మహానుభావుడు

దసరా సినిమాల్లో 'క్లీన్‌ హిట్‌'గా మహానుభావుడు నిలిచింది. స్పైడర్‌ డిజాస్టర్‌ కాగా, జై లవకుశ బ్రేక్‌ ఈవెన్‌ మార్కు చేరుకోవడం కోసం తంటాలు పడుతోంది. మహానుభావుడు ఒక్కటే స్టడీ కలక్షన్లతో విజయపథంలో సాగుతోంది. ఈ చిత్రానికి పెరుగుతోన్న ఆదరణతో ఈవారంలో మరో వంద థియేటర్లు పెంచుతున్నారు.

రెండవ వారంలో కేవలం హైదరాబాద్‌లోనే ఈ చిత్రానికి డెబ్బయ్‌ థియేటర్లు కేటాయించారు. ఒక చిన్న సినిమాకి రెండవ వారంలో ఇన్ని థియేటర్లు పెట్టడం ఇదే తొలిసారి. ఈవారంలో కొత్త సినిమాలేమీ లేకపోవడంతో మహానుభావుడు వీకెండ్‌లో అదరగొడుతుందని బయ్యర్లు కాన్ఫిడెంట్‌గా వున్నారు.

అందుకే ఆ ఊపుని క్యాష్‌ చేసుకోవడం కోసం థియేటర్లు పెంచి సర్వ సన్నద్ధమయ్యారు. శుభ్రత - పరిశుభ్రత థీమ్‌తో మారుతి సృష్టించిన కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగా కనక్ట్‌ అయ్యారు. శర్వానంద్‌ కెరియర్లో 'శతమానం భవతి' తర్వాత ఇది మరో ఘన విజయంగా నిలిచింది.

యువి క్రియేషన్స్‌ సంస్థలో హ్యాట్రిక్‌ కొట్టిన శర్వానంద్‌ ఈ చిత్రంతో మిడ్‌ రేంజ్‌ స్టార్‌గా తన లెవల్‌ని, గుడ్‌విల్‌ని ఇంకాస్త పెంచుకున్నాడు. మారుతి కూడా ఇప్పుడు మధ్య శ్రేణి హీరోలకి త్రివిక్రమ్‌ మాదిరి మినిమమ్‌ గ్యారెంటీ దర్శకుడైపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు