అనుష్క‌లో అదే న‌చ్చ‌దు...అమీర్ తో కోహ్లీ!

అనుష్క‌లో అదే న‌చ్చ‌దు...అమీర్ తో కోహ్లీ!

ఈ దీపావ‌ళికి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఇద్ద‌రు సెల‌బ్రిటీలు డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నారు. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఓ టీవీ చానెల్ లో ప్ర‌సార‌మ‌య్యే టాక్ షోలో సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ షోకు అమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ సంద‌ర్భంగా విరాట్ ప్రియురాలు అనుష్క గురించి అమీర్ కొన్నిఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగాడ‌ట‌. ఆ ప్ర‌శ్న‌ల‌కు విరాట్ కూడా త‌డుముకోకుండా స‌మాధానాలిచ్చాడ‌ట‌. అనుష్క‌లో విరాట్ కు న‌చ్చే, నచ్చ‌ని విష‌యాల గురించి అమీర్ ప్ర‌స్తావించాడ‌ని తెలుస్తోంది. అనుష్క‌లో నిజాయతీ, జాగ్రత్తగా వ్యవహరించడం వంటి అంశాలు త‌న‌కు నచ్చుతాయ‌ని విరాట్ చెప్పాడ‌ని స‌మాచారం. చెప్పిన సమయానికి అనుష్క ఎప్పుడూ రాద‌ని, కొంచెం ఆలస్యంగా వ‌చ్చినా తానెప్పుడూ ఇబ్బందిగా ఫీలవలేద‌ని కోహ్లీ చెప్పుకొచ్చాడట‌.

అమీర్ నటించిన సినిమాల్లో ‘‘జో జీతా వహీ సికిందర్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ ఇష్టమని విరాట్ చెప్పాడ‌ట‌. అనుష్క న‌టించ‌డం వ‌ల్లే విరాట్ కు ‘పీకే’ ఇష్టమైన సినిమా అయింద‌ని అమీర్ చ‌మ‌త్క‌రించాడ‌ట‌. ఈ షోలో భాగంగా కోహ్లీతో టీమిండియా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ వీడియో చాట్ చేశాడ‌ట‌. కోహ్లీలో న‌చ్చే, న‌చ్చ‌ని విష‌యాల గురించి చెప్పాల‌ని రాహుల్ ను అమీర్ కోరాడ‌ట‌. దీంతో, కోహ్లీ పిట్ నెస్ బాగా మెయింటైన్ చేస్తాడ‌ని, అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఎప్పుడూ చొక్కా లేకుండా తిరుగుతుంటాడ‌ని, ఎక్కువ స‌మ‌యం ఫోన్ మాట్లాడుతుంటాడ‌ని రాహుల్ చెప్పిన‌ట్లు స‌మాచారం. అదే విధంగా అమీర్ లో న‌చ్చ‌ని విష‌యాల‌ను సీక్రెట్ సూప‌ర్ స్టార్ లో న‌టించిన జైరా వ‌సీమ్ తో విరాట్ చెప్పించాడ‌ట‌. అమీర్ త‌క్కువ‌గా స్నానం చేస్తాడ‌ని, ఏసీని త‌క్కువ టెంప‌రేచ‌ర్ లో ఉంచుతాడ‌ని చెప్పింద‌ట‌. మంగ‌ళ‌వారం ముంబైలో ఈ షో షూటింగ్ జ‌రిగింది. షూటింగ్ అనంత‌రం స్టూడియో బ‌య‌ట విరాట్ కోహ్లీ క్లాప్ బోర్డుతో ద‌ర్శ‌న‌మివ్వ‌గా, అమీర్ ఖాన్ చేతిలో టీమిండియా జెర్సీ క‌నిపించింది. ఈ షూటింగ్ సెట్ కు అమీర్ కొడుకు ఆజాద్ కూడా వ‌చ్చాడు. ఆ షూటింగ్ అనంత‌రం అమీర్ ట‌ర్కీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న‌ట్లు ట్వీట్ చేశాడు. వీటికి సంబంధించిన ఫొటోలు ట్విట్ట‌ర్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం సీక్రెట్ సూప‌ర్ స్టార్ చిత్ర ప్ర‌మోష‌న్ లో అమీర్ బిజీగా ఉన్నాడు. ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాలు ముగిశాక థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ షూటింగ్ లో తిరిగి పాల్గొంటాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు