జై ల‌వ‌కుశ‌పై ప‌రుచూరి కామెంట్!

జై ల‌వ‌కుశ‌పై ప‌రుచూరి కామెంట్!

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రిభినేయం చేసిన జై ల‌వ‌కుశ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న‌కు అభిమానుల‌తో పాటు టాలీవుడ్ లో ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ముఖ్యంగా జై పాత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా న‌టించాడ‌ని ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.

ఈ సినిమా నేప‌థ్యంలో ఫిల్మ్ క్రిటిక్స్ పై ఎన్టీఆర్ మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, జై ల‌వ‌కుశ చిత్రంపై ప్ర‌ముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని కితాబిచ్చారు. ఈ చిత్ర క్లైమాక్స్ పై ప‌రుచూరి త‌న‌దైన శైలిలో స్పందించారు. జై పాత్ర చ‌నిపోకుండా ఉంటే సినిమా మ‌రింత అద్భుతంగా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల‌కు క‌థ‌లందించిన ప‌రుచూరి గోపాల‌కృష్ణ జైల‌వ‌కుశ క‌థ‌పై త‌న మార్క్ విశ్లేష‌ణ చేశారు. ఆ చిత్రం క్లైమాక్స్ లో 'జై' పాత్ర చనిపోయినట్టు చూపించుకుండా ఉంటే చాలా బాగుండేదని అభిప్రాయప‌డ్డారు. జై పాత్ర‌లో ఎన్టీఆర్‌ నటన ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌న్నారు.    "నేననేది అబద్ధం.. మ.. మ.. మనం అనేదే నిజం.

నాకోసం చచ్చిపోదామని మీరు అనుకున్నారని తెలిసిన తర్వాత కూడా నేనేలా చనిపోతానురా'' అని 'జై'తో చెప్పించి ఉంటే బాగుండేద‌ని ప‌రుచూరి అన్నారు. ముగ్గురు అన్నదమ్ముల అనుబంధంపై క్లైమాక్స్ ను లాక్ చేసి ఉంటే మ‌రింత బాగుండేద‌ని చెప్పారు. అయితే, ఇది కేవ‌లం త‌న అభిప్రాయం మాత్ర‌మేన‌ని, త‌న‌ మ‌న‌సులోని ఆలోచ‌న‌ను బ‌య‌ట‌పెట్టాన‌ని ప‌రుచూరి అన్నారు.   దీనిని రివ్యూలా భావించ‌వ‌ద్ద‌ని కోరారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరుకు మాత్రమే చిన్న రామయ్యని, నటనలో పెద్ద రామయ్యేనంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. క్రిటిక్స్ వ్యాఖ్య‌ల‌ను ఎన్టీఆర్ పట్టించుకోకుండా ఉండాల్సిందని ప‌రుచూరి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు