వద్దు బాబోయ్‌ అని దణ్ణం పెట్టేసిన సునీల్‌!

వద్దు బాబోయ్‌ అని దణ్ణం పెట్టేసిన సునీల్‌!

'ఉంగరాల రాంబాబు'తో కనీసం 'పూలరంగడు'లాంటి హిట్‌ వస్తుందని సునీల్‌ ఆశించాడు. కానీ అతడిని అలాంటి కమర్షియల్‌ చిత్రంలో ఆదరించడానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. కామెడీ వదిలేసి హీరోగా స్థిరపడాలని చూడడంతోనే సునీల్‌ రాంగ్‌ స్టెప్‌ వేసాడు. అడపాదడపా హీరోగా చేసుకుంటూ కమెడియన్‌గా తన స్థాయి అలాగే కొనసాగించినట్టయితే ఇప్పుడతను వేరేలా వుండేవాడు.

సిక్స్‌ ప్యాక్‌లు, యాక్షన్‌ సీన్లు అంటూ ఆకాలం చిరంజీవి ఫార్ములా ఫాలో అవ్వాలని చూసి భంగపడ్డాడు. ఉంగరాల రాంబాబు ఘోర పరాజయంతో రియలైజేషన్‌ వచ్చిన సునీల్‌ ఇక యాక్షన్‌ సినిమాలకి ససేమీరా అంటున్నాడట. యాక్షన్‌ థ్రిల్లర్‌ అయిన ఒక తమిళ రీమేక్‌లో నటించడానికి సునీల్‌ ఓకే చెప్పాడు.

కానీ ఇప్పుడా నిర్మాతకి అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేసి, ఈ రీమేక్‌ చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో చేస్తోన్న 'టూ కంట్రీస్‌' రీమేక్‌తో అయినా పోయిన వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తోన్న సునీల్‌ మళ్లీ కామెడీ పాత్రల వైపు కూడా దృష్టి సారించాడు. చిరంజీవి చేస్తోన్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో సునీల్‌ ఒక ఫుల్‌లెంగ్త్‌ కామెడీ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English