ఎన్టీఆర్‌కి ఇంకా అలాంటిది పడలేదు

ఎన్టీఆర్‌కి ఇంకా అలాంటిది పడలేదు

ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ ప్రస్తుతం పైపైకి వెళుతోంది. మామూలు చిత్రాలకి మంచి వసూళ్లు రాబడుతూ స్టార్‌గా తన సత్తా చాటుకుంటున్నాడు. 'జై లవకుశ' చిత్రం ఫుల్‌ రన్‌లో డెబ్బయ్‌ కోట్లకి పైగా షేర్‌ తెచ్చుకుంటుందని అంచనాలున్నాయి. యావరేజ్‌ టాక్‌ వచ్చిన ఈ సినిమాకి బాక్సాఫీస్‌ పరంగా అన్నీ ఎన్టీఆరే అయ్యాడు. ఇంతకుముందు జనతా గ్యారేజ్‌తో కూడా ఆకట్టుకున్న ఎన్టీఆర్‌కి టెంపర్‌ నుంచి మంచి టైమ్‌ స్టార్ట్‌ అయింది.

అయితే 'సింహాద్రి' తర్వాత ఎన్టీఆర్‌కి మళ్లీ అంతటి ఘన విజయం మాత్రం ఇంకా రాలేదు. సింహాద్రి మాదిరిగా బాక్సాఫీస్‌ వద్ద విధ్వంసం చేసిన బ్లాక్‌బస్టర్‌ ఎన్టీఆర్‌నుంచి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. టెంపర్‌ నుంచి జై లవకుశ వరకు ఎన్టీఆర్‌ గ్రాఫ్‌ బాగా మెయింటైన్‌ అయింది కానీ యునానిమస్‌ బ్లాక్‌బస్టర్‌ మాత్రం మిస్సింగ్‌.

ఆ లోటుని త్రివిక్రమ్‌ సినిమా తీరుస్తుందని, ఆ చిత్రంతో ఎన్టీఆర్‌కి మళ్లీ సింహాద్రిలాంటి ఘన విజయం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చిలో మొదలు పెడతానని త్రివిక్రమ్‌ చెప్పడంతో ఎన్టీఆర్‌ అంతవరకు విరామం తీసుకుని కొత్త లుక్‌ మీద వర్క్‌ చేసే పనిలో వుండనున్నాడు. త్రివిక్రమ్‌ సినిమా మొదలయ్యేలోగా మరే సినిమా చేయాలని అతను భావించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు